వాకింగ్ కు వెళ్లిన మహిళను వెనుక నుంచి వాటేసుకుని ?, సోషల్ మీడియాలో వైరల్
వాకింగ్ వెలుతున్న మహిళను లైంగికంగా వేధించాడనే ఆరోపణపై బెంగళూరు పోలీసులు క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఈ ఘటన ఉదయం 5 గంటల ప్రాంతంలో బెంగళూరు నగరంలోని కోణెణకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానందనగర్‌లో చోటు చేసుకుంది. వేకువ జామున వాకింగ్ వెలుతున్న మహిళను వెనుక నుంచి పట్టుకున్న నిందితులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెకు ముద్దులు పెట్టడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 35 ఏళ్ల బాధితురాలు నిందితుడిప ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

కనకపుర తాలూకా సంతెకోడిహళ్లి గ్రామానికి చెందిన నిందితుడు సురేష్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. కొన్నేళ్ల క్రితం బెంగళూరు చేరుకుని ఇక్కడి కోణెణకుంటే ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లి కంపెనీ దగ్గర దింపుతాడు.
ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ ప్రతిరోజు వేకువ జామున వాకింగ్ వెలుతోంది. అందమైన మహిళపై మోజుపడిన ఆమెను
వెనుక నుండి వెళ్లి కౌగిలించుకుని ముద్దులు పెట్టాలని క్యాబ్ డ్రైవర్ సురేష్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు.
ఆగస్టు 2వ తేదీన వేకువ జామున 5 గంటల సమయంలో కృష్ణానంద నగర్‌లో నివాసం ఉంటున్న మహిళ వాకింగ్‌కు వెళ్తుండగా నిందితుడు సురేష్ వెనుక నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కౌగిలించుకుని ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఆ సమయంలో మహిళ తీవ్రంగా ప్రతిఘటించి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే ఆమెను వెంబడించిన నిందితుడు సురేష్ మళ్లీ మహిళను పట్టుకుని కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత మహిళ అతడి నుంచి తప్పించుకుని ఇంటికి పరుగులు తీసింది. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడం, ఆ వీడియోలు బయటకు రావడం జరిగింది. క్యాబ్ డ్రైవర్ సురేష్ వాకింగ్ వెలుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనతో షాక్‌కు గురైన మహిళ మొదట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు రోజులు ఆలస్యంగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు తెలిపారు.
క్యాబ్ డ్రైవర్ సురేష్ ఓ మహిళను కౌగిలించుకుని లైంగికంగా వేధిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని సోషల్ మీడియాలో ఎవరు పోస్టు చేశారు అంటూ కోణేణకుంటే పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈఘటన తీవ్రతను గుర్తించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై ఏఎస్సైతో సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేస్తూ సౌత్ డివిజన్ డీసీపీ లోకేశ్ ఆదేశాలు ఆదేశించారు.












Click it and Unblock the Notifications