PM: విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోదీ, కార్యక్రమానికి వెళ్లి గుండెపోటుతో ?
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలోని సోగానేలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయం ప్రారంభించిన తరువాత కార్యక్రమం పూర్తి అయ్యింది. అందరూ ఎవరిపాటికి వాళ్లు ఇళ్లకు బయలుదేరారు. మోదీ కార్యక్రమం పూర్తి అయిన కొన్ని నిమిషాలకే బీజేపీ వీరాభిమాని ప్రాణం పోయింది.

ప్రధాని మోదీ కార్యక్రమం
ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం పూర్తి అయిన కొద్దిసేపటికే ఓ బీజేపీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందడంతో ఆప్రాంతంలోన విషాదచాయలు నెలకొన్నాయి. శివమొగ్గ జిల్లాలోని
సొరబ తాలూకా చీమలూరు గ్రామానికి చెందిన మల్లికార్జున (56) అనే బీజేపీ కార్యకర్త, బీఎస్ యడియూరప్ప వీరాభిమాని గుండెపోటుతో మృతి చెందాడు.

రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు
సోగానే ఎయిర్‌పోర్ట్ రోడ్డుకు సమీపంలోని సంతే కడూరు గ్రామం సమీపంలోని మెయిర్ రోడ్డులోనే మల్లికార్జున చనిపోయాడు. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి మల్లికార్జున హాజరైనాడు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మల్లికార్జున మార్గమధ్యలోనే నీరసకంగా కుప్పకూలిపోయాడు.

ప్రథమ చికిత్సపై అవగాహన లేదు
రోడ్డుపక్కన కుప్పకూలిన మల్లికార్జునను రక్షించడానికి చుట్టుపక్కలవారు పరుగెత్తారు. అయితే వారిలో ఎవరికీ ప్రథమ చికిత్స మీద అవగాహనలేకపోవడం, గుండెపోటుకు ఎలా ప్రథమ చికిత్స చెయ్యాలని తెలీకపోవడంతో కొంత సేపటికే మల్లికార్జున ప్రాణం పోయింది, తరువాత వేరే వాహనంలో పోలీసులు మల్లికార్జునను ఆస్పత్రికి తరలించారు.

మోదీని చూడాలని వెళ్లి తిరిగిరాని లోకాలకు
అయితే అప్పటికే మల్లికార్జున ప్రాణం పోయిందని వైద్యులు తెలిపారు. మల్లికార్జుజన మృతదేహాన్ని అతని సొంత ఊరు అయిన చీమలూరు గ్రామానికి తరలించారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరైన మల్లికార్జున అదే ప్రాంతంలో గుండెపోటుతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి. మల్లికార్జున కుటుంబ సభ్యులను శివమొగ్గ బీజేపీ నాయకులు పరామర్శించారు. సోమవారం ఉదయం తాను ప్రధాని నరేంద్ర మోదీని చూసి వస్తానని ఊర్లో కొంత మందితో మల్లికార్జున చెప్పాడని గ్రామస్తులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్. కేంద్ర మంత్రులతో పాటు కర్ణాటక మంత్రులు పాల్గొన్నా గుండెపోటుతో మరణించిన మల్లికార్జున గురించి ఎక్కడా మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications