వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడిపోయింది.. రూ.51లక్షల జీతంతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వరించింది!!

|
Google Oneindia TeluguNews

అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏ పనీ చేయకుండా తిరుగుతున్న యువత అనేక మంది ఉన్న నేటి రోజుల్లో, అవయవ లోపం ఉన్నా ఆ లోపాన్ని అధిగమించి అద్భుతమైన విజయాలను సాధిస్తున్న వారు ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. శరీరంలో ఏ భాగం పని చేయకున్నా ఇబ్బందిగానే ఉంటుంది. అందులోనూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పినట్టు కళ్ళు లేకపోతే అన్నిటికంటే దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిని సైతం ఎదుర్కొని తనకు వచ్చిన ఎన్నో కష్టాలను అధిగమించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని భావించిన ఓ వ్యక్తి సంకల్ప బలం ముందు అంధత్వం ఓడిపోయింది. ఏకంగా మైక్రోసాఫ్ట్ అలాంటిది కంపెనీలో 51 లక్షల రూపాయల ప్యాకేజీ తో ఉద్యోగం అతడిని వరించింది.

చిన్నవయసులోనే చూపు కోల్పోయిన సౌరభ్

చిన్నవయసులోనే చూపు కోల్పోయిన సౌరభ్

11 సంవత్సరాల వయసులోనే గ్లకోమా కారణంగా కంటి చూపు కోల్పోయిన జార్ఖండ్ ఛత్రా జిల్లాలోని తాండ్వా బ్లాక్లోని చట్టీగాడీలోంగ్ కు చెందిన సౌరభ్ చిన్నప్పుడే చూపును కోల్పోయాడు. అయినప్పటికీ అతను అంధత్వాన్ని లెక్కచేయకుండా బ్రెయిలీ లిపిలో తన చదువును కొనసాగించాడు. ఇంట్లో తల్లిదండ్రుల సహకారం, వారు అందించిన ఆత్మవిశ్వాసం సౌరభ్ ను ముందుకు నడిపించింది. సౌరబ్ తండ్రి ఒక టీచర్ కావడంతో ఆయన కుమారుడు కళ్ళు లేవని ఆత్మన్యూనతా భావానికి గురికాకుండా, కుమారుడిని నిరంతరం ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు.

 చదువులో మామూలు విద్యార్థులతో పోటీ పడిన సౌరభ్

చదువులో మామూలు విద్యార్థులతో పోటీ పడిన సౌరభ్

దీంతో చదువులోనూ ఏ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు సౌరభ్ . కళ్ళు ఉన్న బాగా చదివే పిల్లలతో పోటీపడి సౌరభ్ తన చదువును కొనసాగించాడు. ఇంటర్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఢిల్లీ ఐఐటీలో సీటు సంపాదించాడు. ప్రస్తుతం అతను ఇంజనీరింగ్ సిఎస్ఈ లో థర్డ్ ఇయర్ చదువుతుండగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఉద్యోగం వరించింది. ఏకంగా 51 లక్షల రూపాయల ప్యాకేజీ తో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నాడు సౌరభ్.

ఆత్మ విశ్వాసమే తన బలంగా ముందుకు సాగానన్న సౌరభ్

ఆత్మ విశ్వాసమే తన బలంగా ముందుకు సాగానన్న సౌరభ్


తనకున్న వైకల్యం గురించి ఏ రోజు తాను భయపడలేదని, బాధ పడలేదని, అది తనకు అవరోధంగా తానెప్పుడూ భావించలేదని, ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుంటూ తాను ముందుకు సాగానని సౌరభ్ ఈ సందర్భంగా చెబుతున్నారు. తాను సాధించిన విజయం వెనుక తన తల్లిదండ్రుల సపోర్ట్ తనకు ఎంతగానో ఉందని ఆయన తెలిపాడు. ఇక కుమారుడికి వచ్చిన ఉద్యోగం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన సౌరభ్

సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన సౌరభ్


అన్ని అంగాలు సక్రమంగా ఉన్నా ఏమీ చేయలేమని, తల్లిదండ్రులకు భారంగా మారుతున్న ఎంతో మంది యువత ఉన్న నేటి రోజుల్లో, అన్నింటిలోకి ప్రధానమైన కళ్ళు లేకున్నా, చుట్టూ చీకటి అలముకున్నా పట్టుదల ఉంటే, సంకల్పబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన సౌరభ్ ఈతరం ఎంతో మంది యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.

English summary
Blindness succumbed to the determination of Saurabh. A blind young man Sourabh from the state of Jharkhand Got a job in Microsoft with a salary of Rs.51 lakhs in campus placement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X