విషాదం: బీహార్‌లో పడవ మునిగి 15 మంది మృతి
ఔరంగాబాద్: బీహార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలు విద్యార్ధులతో సహా 15 మందితో వెళ్తోన్న పడవ మునిగిపోయింది. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో పిల్లలు, పెద్దలతో కలిసి వెళ్తున్న పడవ పంపిన్ నదిలో ఒక్కసారిగా మునిగిపోయింది.
వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పడవలో ప్రయాణిస్తున్న అందరూ మృతి చెంది ఉండవచ్చిన ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Aurangabad (Bihar): A boat carrying over 15 people including school children sinks in Punpun river, search and rescue operations underway.
— ANI (@ANI_news) August 23, 2016












Click it and Unblock the Notifications