Wife: ఆ ఊరు పేరు చెబితే ?, మరో మహిళను నరబలి ఇవ్వాలని బాయ్ ఫ్రెండ్ మంత్రగాడు ? జస్ట్ !
తిరువనంతపురం/కొడుగు: ఆర్థిక సమస్యలు తీరిపోయి త్వరగా శ్రీమంతుడు కావాలని ఆశపడిన డాక్టర్ దంపతులు ఓ మంత్రగాడి సహాయంతో ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే. కేరళలోని తిరువళ్ల ప్రాంతంలో ఇద్దరు మహిళల నరబలి జరిగింది. అదే తిరువళ్లలో ఓ వివాహిత మహిళను నరబలి ఇవ్వడానికి ప్రయత్నించడం, ఆమె తప్పించుకుని పారిపోవడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. భర్తతో నిత్యం గొడవలు జరుగుతున్నాయని ఆవేదనతో మా సమస్యలు పరిష్కరించాలని భార్య ఓ కేరళ మంత్రగాడిని సంప్రధించడంతో అతను ఆమెను నరబలి ఇవ్వడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

డాక్టర్ దంపతుల అరాచకం... ఇద్దరు మహిళల నరబలి
కేరళలోని పతనంమిట్టలోని తిరువళ్లలో నివాసం ఉంటున్న నాటు వైద్యుడు భగవాల్ సింగ్ అలియాస్ డాక్టర్ భగవాల్, లైలా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతుంటే అతన్ని క్యాష్ చేసుకోవాలని మంత్రగాడు మోహమ్మద్ షఫీ స్కెచ్ వేశాడు. భగవాల్ సింగ్, లైలా దంపతులు, మంత్రగాడు మోహమ్మద్ షఫి కలసి ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చేశారు.

అందుకే అక్కడే ఉన్నారు
ఆర్థిక సమస్యలు తీరిపోయి త్వరగా శ్రీమంతుడు కావాలని ఆశపడిన డాక్టర్ భగవాల్ సింగ్, లైలా దంపతులు మంత్రగాడు మోహమ్మద్ షఫీ సహాయంతో ఇద్దరు మహిళలను నరబలి ఇవ్వడం దేశవ్యాప్తంగా కలకలంరేపిన విషయం తెలిసిందే. సింగ్, లైలా దంపతులు మంత్రగాడు మోహమ్మద్ షఫీ ప్రస్తుతం జైల్లో ఉంటూ బెయిల్ మీద బయటకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే ప్రాంతంలో మరో నరబలికి ప్రయత్నం
ఇద్దరు మహిళల నరబలి తరువాత కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని మంత్రగాళ్ల మీద నిఘా వేసింది. కేరళలోని తిరువళ్ల ప్రాంతంలో ఇద్దరు మహిళల నరబలి జరిగింది. అదే తిరువళ్లలో ఓ వివాహిత మహిళను మంత్రగాడు, ఆ మహిళ స్నేహితుడు కలసి ఆమెను నరబలి ఇవ్వడానికి ప్రయత్నించడం, ఆమె తప్పించుకుని పారిపోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఎందుకు వెళ్లిందంటే ?
కర్ణాటకలోని కొడుగు జిల్లాకు చెందిన మహిళకు వివాహం అయ్యింది. ఆమె నిత్యం భర్తతో గొడవలు పడింది. రోజురోజుకు గొడవలు ఎక్కువ కావడంతో ఆమె భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన మహిళ ప్రస్తుతం కొచ్చిలో నివాసం ఉంటున్నది. తన సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఏం చెయ్యాలో తెలీయడం లేదని సన్నిహితుల దగ్గర ఆమె ఆవేదన వ్యక్తంచేసింది.

మంత్రగాడు పోటుగాడు.... ప్రయత్నించండి
ఓ స్నేహితుడు భర్తను వదిలేసిన మహిళకు దగ్గర అయ్యాడు. తిరువళ్లులో ఓ ఫేమస్ మంత్రగాడు ఉన్నాడని, అతన్ని కలిస్తే నీ సమస్యలు అన్నీ తిరిపోయి నువ్వు హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉందని ఆ కేటుగాడు ఆమె స్నేహితురాలికి చెప్పాడు. నా సమస్యలు పరిష్కారం అయితే అంతేచాలు అనుకున్న ఆమె మంత్రగాడిని కలిసింది.

పూజలు చేసే సమయంలో నరబలి ?
నీ సమస్యలు పరిష్కారం కావాలంటే పూజలు చెయ్యాలని మంత్రగాడు ఆమెకు చెప్పాడు. ఆమెను ఇంట్లో కుర్చోబెట్టి పూజలు చేస్తున్న సమయంలో మంత్రగాడు, ఆమె స్నేహితుడు రాత్రి మహిళను నరబలి ఇచ్చేద్దాం అని మాట్లాడుకున్నారు. మంత్రగాడు, స్నేహితుడు మాట్లాడుకుంటున్న సమమంలో వారు మాట్లాడుకున్న మాటలు విన్న మహిళ పూజ మద్యలో లేచి బయటకు పరుగు తీసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది.

నరబలి నుంచి ఎస్కేప్.... బతికిపోయిన మహిళ
కొన్ని రోజులు రహస్య ప్రాంతంలో తలదాచుకున్న ఆమె తరువాత ఓ స్నేహితుడి సహాయంతో ధైర్యం చేసి మంత్రగాడు, ఆమె స్నేహితుమీద కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నివేదికన ఏడీజీపీకి సమర్పించారు. పై అధికారుల ఆదేశాలతో మంత్రగాడు, మహిళకు మాయమాటలు చెప్పి ఆమెను నరబలి ఇవ్వడానికి ప్రయత్నించిన ఆమె స్రేహితుడి కోసం గాలిస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications