గర్ల్ ఫ్రెండ్ ను గర్బవతిని చేసిన ప్రియుడు, నీ కడుపులో బిడ్డకు ఎవడో తండ్రి ?, సజీవదహనం చేసి ?
పాట్నా/బీహార్: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. అమ్మాయి మైనర్. అయితే చూడటానికి యువతి చాలా అందంగా, ఎత్తుగా, లావుగా ఉండటంతో ఆ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్న ప్రియుడు ఆమెను గర్బవతిని చేశాడు. తాను గర్బవతి అని, మనం పెళ్లి చేసుకుందామని ప్రియురాలు ఆమె ప్రియుడి మీద ఒత్తిడి చేసింది. మోజు తీరిపోయిందని, ప్రియురాలు గర్బవతి అయిందని షాక్ అయ్యాడు. నీకడుపులో బిడ్డకు నేను తండ్రి కాదని ప్రియుడు ఎదురు తిరిగాడు.

మైనర్ అమ్మాయితో లవ్ ట్రాక్
బీహార్‌లోని నవాడా జిల్లా రాజావలి ప్రాంతంలోని ఓ గ్రామంలో సోను కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. గత ఏడాది సోను కుమార్ కు 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయితో పరిచయం అయ్యింది. రానురాను మైనర్ అమ్మాయి, సోను కూమార్ రోజు కలుసుకున్నారు. చివరికి సోనూ కుమార్ ప్రేమ పేరుతో ఆమెను లొంగదీసుకున్నారు. పెళ్లికి ముందే సోను కుమార్, మైనర్ అమ్మాయి సన్నిహితంగా మెలిగి శారీరక సంబంధం పెట్టుకున్నారు.

గర్బవతిని చేసి తప్పించుకున్న ప్రియుడు
ప్రియుడు సోను కుమార్ కారణంగా మైనర్ బాలిక గర్భవతి అయింది. నేను గర్భవతి అయ్యానని ప్రియురాలు ఆమె ప్రియుడు సోను కుమార్‌కు తెలియజేసింది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు సోను కూమార్ మీద ఒత్తిడి చేసింది. ఈమాట విన్న సోను కుమార్ ఆ అమ్మాయితో మాట్లాడకుండా తప్పించుకోవడం మొదలుపెట్టాడు. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు డిసైడ్ అయ్యింది. అయితే మార్చి 13వ తేదీన ప్రియురాలు ఆమె ప్రియుడు సోను కుమార్ వెంటపడి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది.

ప్రియురాలు సజీవదహనం
ఆ సందర్బంలో సోనుకుమార్‌కు, ఆమె మధ్య గొడవ జరిగింది. వాగ్వాదంతో రగిలిపోయిన సోను కుమార్, అతని కుటుంబ సభ్యులు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సందర్బంలో బాలిక తల్లిదండ్రులు అదే ప్రాంతంలో ఉన్నారు. బాలిక తల్లిదండ్రుల సమక్షంలోనే ఆమెకు నిప్పంటించడంతో మంటల్లో కాలిపోయిన గర్భిణి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడితో ఆగకుండా సోను కుమార్ కుటుంబం బాలిక కుటుంబాన్ని ఓ ఇంట్లోకి లాక్కెళ్లి వారిని నిర్బంధించారు.

తప్పించుకున్న అమ్మాయి తండ్రి
గర్బిణి అయిన మైనర్ బాలిక మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా సోను కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన పొలంలో పాతిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత బాలిక తండ్రి సోను కుమార్ నిర్బంధించిన ఇంటి నుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు సోను కుమార్‌తో సహా అతని కుటుంబ సభ్యులు నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోను కుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అందరూ పరారైనారని, వారి కోసం గాలిస్తున్నామని బీహార్ పోలీసులు తెలిపారు. మైనర్ ప్రియురాలని గర్బవతిని చేసిన ప్రియుడే ఆమెను సజీవదహనం చెయ్యడం బీహార్ లో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications