ప్రారంభానికి ముందే కుప్పకూలిన బ్రిడ్జి (వీడియో)
బీహార్ రాష్ట్రంలో మరో ప్రారంభానికి ముందే బ్రిడ్జి కుప్పకూలింది. అరారియాలోని సిఖ్తీ బ్లాక్, కుర్సకట్టా బ్లాక్‌లను కలిపే పదరియా వంతెన నిర్మాణం సమయంలోనే నదిలో కుప్పకూలి మునిగిపోయింది. దాదాపు రూ. 12 కోట్ల నిధులతో నది ఒట్టుకు అనుసంధానం చేసేందుకు వంతెన నిర్మాణం ప్రారంభించగా.. అది కూడా ప్రారంభానికి ముందే కుప్పకూలిపోవడం గమనార్హం.
కాగా, బ్రిడ్జి కూలిన సమయంలో తీసిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో బ్రిడ్జి నిర్మించి ఏడాది కూడా కాలేదు. కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. పదరియా వంతెన మూడు స్తంభాలు నదిలో కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.

కాగా, మొదట మూడు పిల్లర్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మరోవైపు, ఈ వంతెన కూలిపోవడంపై అధికార బీజేపీ, జేడీయూ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నాణ్యత లేని వంతెన నిర్మించారంటూ మండిపడుతున్నారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Bihar | A portion of a bridge over the Bakra River has collapsed in Araria pic.twitter.com/stjDO2Xkq3
— ANI (@ANI) June 18, 2024
ఈ వంతెన నిర్మాణం జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఇందుకోసం దాదాపు రూ. 12 కోట్లు ఖర్చు పెట్టారు. బ్రిడ్జి పూర్తైనప్పటికీ.. ఇరువైపుల అప్రోజ్ రోడ్డు పనులు మిగిలి ఉండటంతో ప్రారంభించలేదని తెలిసింది. కాగా, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి కుప్పకూలిందని స్థానిక ఎమ్మెల్యే విజయ్ మండల్ ఆరోపించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications