Union Budget 2025: నిర్మలమ్మ అతి తక్కువ టైమ్ బడ్జెట్ ప్రసంగం ఇదేనా..!
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఇప్పటివరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎనిమిదో సారి ఆమె బడ్జెట్ ప్రసంగం ఒక గంటా 14 నిమిషాల పాటు జరిగింది. అయితే ఈ సారి మాత్రమే ఆమె తక్కువ సమయంలో బడ్జెట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 1 న ఆమె ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కేవలం 56 నిమిషాలు మాత్రమే సాగింది.
అతి తక్కువ సమయం ఇదేనా..
1977లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హిరుభాయ్ ముల్లిజిభాయ్ పటేల్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఇప్పటివరకూ అతి తక్కువ సమయంగా ఉంది. ఈ బడ్జెట్ కేవలం 800 పదాలు మాత్రమే ఉండటం విశేషం.

8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..
2020లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మాత్రం 2 గంటల 40 నిమిషాల పాటు జరిగింది. సమయం మరీ ఎక్కువ అవుతుండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే అత్యధిక సమయం కావడం గమనార్హం.
ఇక జులై 5, 2019లో నిర్మలమ్మ బడ్జెట్ స్పీచ్ 2 గంటల 17 నిమిషాలు సాగింది. 2020లో అత్యధికంగా 2 గంటల 40 నిమిషాలు, 2021లో 1 గంట 50 నిమిషాలు, 2022లో 1 గంట 32 నిమిషాల పాటు జరిగింది. ఇక 2023లో ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడానికి 1 గంట 27 నిమిషాలు తీసుకున్నారు. 2024 లో 1 గంట 22 నిమిషాల పాటు తన ప్రసంగం చేశారు.
వేతన జీవులకు వరాలు..
వేతన జీవులకోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యక్తిగత ఆదాయపన్నుపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు నిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆయిల్ ధరలపై ఫోకస్..
వంటనూనెలపై దేశవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ కొనసాగుతోంది.నూనెల ధరలు పేదవాడికి భారంగా మారిన నేపథ్యంలో వంటనూనెల ధరల తగ్గింపునకు ఆరు సంవత్సరాల మిషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications