Viral Video: రోడ్డుపై ఎక్కువ చేస్తే ఇలానే ఉంటుంది.. వైరల్ గా మారిన వీడియో..

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో NH-5లో కారు డివైడర్‌పై నుంచి దూకి రెయిలింగ్‌ను ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారింది. అమృత్‌సర్‌కు చెందిన నివాసి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ విన్యాసాలు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది. వాహనం దెబ్బతిన్నప్పటికీ అతను సురక్షితంగా బయటపడ్డాడు. ధరంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 279 కింద కేసు నమోదు చేసినట్లు సోలన్ పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో, జూలై 25 ఉదయం ఔటర్ ఢిల్లీలోని నంగ్లీ పూనా ప్రాంతంలో ప్రయాణికుల కోసం బస్టాండ్‌లో ఆగి ఉన్న క్లస్టర్ బస్సును కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు జమ్నా (62), ఆమె కుమార్తె జ్యోతి శర్మ (27), వారి బంధువు నిషా (32). నిషా 18 నెలల కుమారుడు, కారు డ్రైవర్ సునీల్, కుటుంబ బంధువు కూడా గాయపడ్డారు. వారు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారని, బస్సు ముఖ్మేల్‌పూర్ నుంచి ఆజాద్‌పూర్‌కు వెళ్తోందని పోలీసులు తెలిపారు.

A car jumping over a divider and colliding with railing in himachal pradesh video goes viral

హిమాచల్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన జమ్నా, ఆమె కుమార్తె జ్యోతికి హాంకాంగ్‌లో రెస్టారెంట్‌ ఉంది. వారు ఇటీవలే ఇండియాకు వచ్చారు. వారిద్దరూ ఆగస్టు 4న హాంకాంగ్‌కు వెళ్లాలని విమాన టికెట్ బుక్ చేసుకున్నారు. వారు ఘజియాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నంగ్లీ పూనా సమీపంలోని హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించి స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఉదయం 7.04 గంటలకు పిసిఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్ నార్త్) బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+