కులం తెచ్చిన తంటా, నిన్న టాప్ హీరో, ఇప్పుడు మంత్రి మీద కేసు, వీడియో !
బెంగళూరు: గతంలో దళితులపై కుల దూషణలకు పాల్పడిన నటుడు, దర్శకుడు, కర్ణాటక ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు ఉపేంద్రపై బెంగళూరులో కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఓ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేశారని, కులం పేరుతో కొందరిని దూషించారని బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
హీరో ఉపేంద్ర ప్రజాకీయం గురించి లైవ్‌లో మాట్లాడుతూ ఓ కులం గురించి చులకనగా మాట్లాడారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు కర్ణాటక కోర్టుకు చేరింది. అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించినందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రస్తుతంలోని ఉద్యావనాల శాఖ మంత్రి ఎస్ఎస్. మల్లికార్జున్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు..

ఈవిషయమై గళం విప్పిన నటుడు ఉపేంద్ర మద్దతుదారులు, 'ప్రజాకీయ' కార్యకర్తలు మీకు బలం ఉంటే మంత్రిపై కేసు పెట్టాలని సవాల్ విసిరారు. కర్ణాటక మంత్రి ఎస్ఎస్. మల్లికార్జున్ దావణగెరె ఉత్తర నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సిద్దరామయ్య ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.
ఎస్ఎస్. మల్లికార్జున్ తో పాటు ఆయన సతీమణి డాక్టర్ ప్రభా మల్లికార్జున్‌తో కలిసి మూడు నెలల క్రితం ఓ యూట్యూబ్ చానల్ ఇప్పటి మంత్రి అయిన మల్లికార్జున్ ను ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ కొందరు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని ఓ కులాన్ని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఈ పాత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే నేను ఎలాంటి అభ్యంతరకర ప్రకటన చేయలేదని మంత్రి ఎస్ఎస్. మల్లికార్జున్ స్పష్టం చేశారు. నా ప్రకటనను వక్రీకరించారని మంత్రి అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమై మంత్రి మల్లికార్జున్ పై బెంగళూరులోని రాజాజీనగర్ పోలీస్ ర్ కేసు నమోదు అయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications