బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Finance: తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు, శ్రీదేవికి రూ. 10 కోట్ల లోన్ మంజూరు, ట్విస్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తక్కువ వడ్డీకి రుణం ఇస్తామని ఎర చూపి సుమారు 40 మందిని రూ.80 లక్షలు మోసం చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఐటీ హబ్ లో నాలుగు నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులు వేసిన స్కెచ్ తో 40 మందికి పైగా అమాయకులు వాళ్ల స్కామ్ లో ఇరుక్కుని లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. లోన్ కథ దేవుడు ఎరుగు, అసలు ఇస్తే చాలు అని బాధితులు వేడుకున్నా వాళ్లు మాత్రం పంగనామాలు పెట్టడానికి ప్రయత్నించడంతో మ్యాటర్ బయటకు వచ్చింది.

Lady SI: భర్తను చంపాలని రూ. 10 లక్షలు ఇచ్చిన లేడీ ఎస్ఐ, కారు డ్రైవర్ తో మేడమ్ ?, దృశ్యం సినిమా !

 తక్కువ వడ్డీ

తక్కువ వడ్డీ

తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు మోసం చేసిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ సహా ఇద్దరిని బెంగళూరులోని వయాలికావల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పరారీలో ఉన్న స్వామినాథన్‌ సుబ్బయ్య శెట్టి, సీనియర్‌ మేనేజర్‌ లక్ష్మేనారాయణ, సిబ్బంది వత్సల, బాలు తదితరుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్‌ లో నివాసం ఉంటున్న వెంకటేష్‌, సుగుణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 శ్రీదేవికి కుచ్చుటోపి

శ్రీదేవికి కుచ్చుటోపి

ఇటీవల బెంగళూరులోని సహకార నగర్ కు చెందిన శ్రీదేవికి రూ. 10కోట్లు రుణం ఇప్పిస్తానని నిందితులు చెప్పారు. శ్రీదేవి దగ్గర రూ. 11 లక్షలు తీసుకుని మోసం చేశారు. బాధితురాలు శ్రీదేవి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు స్వామినాథన్‌ ఫైనాన్స్‌ కంపెనీ మేనేజర్‌ వెంకటేష్‌, అకౌంటింగ్‌ విభాగం అధికారిణి సుగుణను అరెస్టు చేశారు.

 నాలుగు నెలల క్రితం కంపెనీ

నాలుగు నెలల క్రితం కంపెనీ

నాలుగు నెలల క్రితం స్వామినాథన్, సుబ్బయ్య శెట్టి వినాయక సర్కిల్ లోని వయాలికావల్ సమీపంలో 'స్వామినాథన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్' పేరుతో సంస్థను స్థాపించారు. స్వామినాథన్ ఈ సంస్థకు సీనియర్ మేనేజర్లుగా లక్ష్మేనారాయణ, వెంకటేష్, సుగుణ, వత్సలలను నియమించారు. అక్టోబర్ చివరి నెలలో మా కంపెనీ తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందజేస్తామని పత్రికలలో ప్రకటన ఇచ్చారు.

 ఎగబడి వెళ్లిపోయారు

ఎగబడి వెళ్లిపోయారు

ఈ ప్రకటన చూసిన శ్రీదేవి స్వామినాథన్ ఫైనాన్స్‌ కంపెనీకి వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఫైనాన్స్ కంపెనీ అధికారిణి సుగుణ మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం మా కంపెనీకి లైసెన్స్ వచ్చిందన్నారు. అంతేకాకుండా రుణానికి చట్టపరమైన ఛార్జీ . రూ. 6 వేలులతో పాటు రూ. .5 లక్షలు. చెల్లించాలని సుగుణ చెప్పింది. మా సూచనల మేరకు రుణం మంజూరు చేయడంలో విఫలమైతే కస్టమర్ నుంచి వచ్చిన డబ్బును వడ్డీతో సహా మొత్తం వెనక్కి ఇచ్చేస్తామని శ్రీదేవికి చెప్పారు.

 రూ. 10 కోట్ల లోన్ వచ్చేసిందని ?

రూ. 10 కోట్ల లోన్ వచ్చేసిందని ?

దీన్ని నమ్మిన శ్రీదేవి రూ.10. 4 కోట్ల రుణం కోసం రెండు వేర్వేరు దరఖాస్తులు సమర్పించింది. శ్రీదేవి ఆ కంపెనీ నిర్వహకులకు రూ. 11 లక్షలు ఫీజుగా చెల్లించింది. తరువాత నిందితులు లక్ష్మేనారాయణ, సుగుణ డిసెంబర్ 7న శ్రీదేవికి రుణం మంజూరు చేస్లూ ఓ లెటర్ పంపించారు. తరువాత రెండు వారాలు గడిచినా రుణం సొమ్ము మాత్రం శ్రీదేవి అకౌంట్ లో జమ కాలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే నిందితులు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవారు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న శ్రీదేవి వయ్యాలి కావెల్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో దగా ఫైనాన్స్ కంపెనీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

English summary
A chilling finance company that cheated to give a loan of crores of rupees at low interest in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X