జూలై 9న కర్ణాటక సీఎల్పీ సమావేశం... సర్క్యూలర్ జారీ చేసిన కాంగ్రెస్ ...
కర్ణాటకలో రాజీనామ చేసిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు కాంగ్రేస్ పార్టీ పావులు కదుపుతోంది. పార్టీపై తిరుగుబావుటా ఎగరవేసిన ఎమ్మెల్యేను సీఎల్పీ సమావేశానికి హజరు కావాలని సర్క్యూలర్ జారీ చేశారు. సమావేశానికి హజరు కాని వారిపై పార్టీ పరంగానే వేటు వేసేందుకు సిద్దమవుతున్నారు.
ఎట్టేకేలకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు రంగలోకి దిగారు. పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యేలతో తాడోపేడో తేల్చుకునేందుకు సీఎల్పీ సమావేశాన్ని ఈనెల 9న ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నేతలు సర్క్యూలర్ విడుదల చేశారు. కాగా అంతకు ముందు జరిగిన సమావేశంలో సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యతోపాటు పార్టీ అధ్యక్షుడు దినేష్ గుండురావులతోపాటు పార్టీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్‌లు పాల్గోన్నారు. ఇక 9న జరగనున్న సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తప్పకుండా హజరు కావాలని సర్క్యూలర్‌లో పేర్కోన్నారు. లేని యెడల వారిపై పార్టీ పరంగా చర్యలు చేపడతామని తెలిపారు.

మరోవైపు బీజేపీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందు యడ్యురప్ప నివాసంలో భేటి అయ్యారు. సంక్షోభం తర్వాత కర్ణాటకలో ఒకవేళ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ అమోదించినా ,లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేసినా... బీజేపీ అధికారం చేపేట్టేందుకు అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే కార్ణాటక పావులు కదుపుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications