అపార్ట్ మెంట్ లో ప్రియుడితో రొమాన్స్, భర్తకు మ్యాటర్ తెలిసిపోయింది, ఏం చేసిందంటే ?

బెంగళూరు: కుటుంబీకులు ప్రేమను వ్యతిరేకించడంతో ఓ ప్రైవేట్ కాలేజ్ నర్సింగ్ విద్యార్థిని ఆమె ప్రియుడు కలిసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని సజీవదహనం అయ్యారు. బెంగళూరు నగరంలోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. కరిమమ్మ అగ్రహారానికి చెందిన సౌమిని దాస్ అలియాస్ సౌమిని (21), అభిల్ అబ్రహం (25) అనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

దొడ్డ గుబ్బి సమీపంలోని డి మ్యాక్స్‌ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఇద్దరు వ్యక్తులు నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఫ్లాట్‌లో మంటలు రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పెట్రోల్ ఎక్కువగా మీద పోసుకోవడంతో మంటలు అదుపు ెయ్యడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నానా ఇబ్బంది పడ్డారు.

A college girl set fire to her apartment in Bengaluru with her boyfriend who had an illicit relationship

మంటలు అదుపుచేసే సమయానికి సౌమిని దాస్ స్పాట్ లో చనిపోయింది. కాలిన ప్రియుడు అబ్రహంను పోలీసులు విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స అందక రాత్రి అబ్రహాం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే వివరాలు బయటకు వచ్చాయి. ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సౌమిని ఇంతకు ముందే పెళ్లి జరిగిందని వెలుగు చూసింది.

A college girl set fire to her apartment in Bengaluru with her boyfriend who had an illicit relationship

సౌమిని దాస్ పశ్చిమ బెంగాల్‌కు చెందినది. బెంగళూరు చేరుకున్న సౌమిని దాస్ కరిమమ్మ అగ్రహార సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమెకు రెండేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ కు చెందిన యువకుడితో వివాహమైంది. కుటుంబ సభ్యులు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో సౌమిని దాస్ అంగీకరించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఇక కేరళకు చెందిన అబ్రహాం బెంగళూరు చేరుకుని నర్సింగ్ కాలేజ్ లో అమ్మాయిలు, అబ్బాయిలకు సీట్లు ఇప్పించే ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఏజెన్సీ నడుపుతున్న అబ్రహంకు కొన్ని నెలల క్రితం సౌమిని దాస్‌తో పరిచయం ఏర్పడింది. కాలేజీ సెలవుల్లో, ఆమె ఖాళీగా ఉన్న సమయాల్లో సౌమిని దాస్ అబ్రహం ఏజెన్సీలో పనిచేసేవారు. తాను ఇదే ఏజెన్సీలో పనిచేస్తున్నామని మూడు నెలల క్రితం అబ్రహంను సౌమిని దాస్ ఆమె భర్తకు పరిచయం చేసింది.

క్రమంగా వివాహం చేసుకున్న సౌమిని దాస్, అబ్రహాం స్నేహితులుగా మారి అక్రమం సంబంధం పెట్టుకున్నారు. తరువాత ఓ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకున్న అబ్రహాం అతని ప్రియురాలు సౌమిని తో కలిసి ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్నాడని పోలీసులు అన్నారు. ఇటీవల కోల్‌కతాలోని సొంత ఊరికి వెళ్లిన సౌమిని దాస్ కొంతకాలం అక్కడే ఉంది. తన భార్య సౌమిని దాస్ ఆమె ప్రియుడు అబ్రహాం కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో సహజీవనం చేస్తున్నాడని కోల్ కత్తాలో ఉన్న భర్త ఆమెను చితకబాదేశాడని తెలిసింది.

నువ్వు పద్దతి మార్చుకుని నర్సింగ్ కాలేజ్ లో చదువు పూర్తి చేసి కోల్ కత్తా వచ్చేయాలని భర్త వార్నింగ్ ఇచ్చి అతని భార్య సౌమిని దాస్ కు చెప్పాడు. కోల్ కత్తా నుంచి గత శనివారం బెంగళూరు నగరానికి వచ్చింది. తన భర్తకు విషయం తెలిసిపోయిందని, తన గురించి అతను బంధువులు అందరికి చెడుగా చెప్పాడని, మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండలేమని సౌమిని దాస్ ఆమె ప్రియుడికి చెప్పింది.

A college girl set fire to her apartment in Bengaluru with her boyfriend who had an illicit relationship

ఇదే వియంలో అన్ని రకాలుగా ఆలోచించిన సౌమిని దాస్, అబ్రహాం ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అబ్రహం, సౌమిని దాస్‌లు దొడ్డగుబ్బి సమీపంలోని డి మ్యాక్స్‌ అపార్ట్‌మెంట్‌లో శరీరం మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలు వ్యాపించి తీవ్రగాయాలైన సౌమని దాస్ స్పాట్ లో చనిపోడంతో తీవ్రగాయాలైన అబ్రహాం విక్టోరియా ఆసుపత్రిలో చనిపోయాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+