కాంగ్రెస్ సమావేశంపై కాల్పులు: కుర్చీల కింద దాక్కున్నారు

ఇంఫ్లాల్: మణిపూర్ రాష్ట్రంలో కొంతమేర శాంతియుత పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. ఏదో ఒక మూలన ఉద్రిక్త పరిస్థితులు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అయితే, మణిపూర్ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రచార సభ జరుగుతుండగా కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని పరిణామంతో సభకు హాజరైన వారంతా కుర్చీల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శిస్తున్నారు.

A congress campaign in Manipur interrupted by gunshots

కాంగ్రెస్ సభలే లక్ష్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇది మూడో ఘటన అని తెలిపారు. కాల్పులు ఎన్ఎస్‌సీఎన్-ఐఎం పనేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేగాక, ఎన్నికల సంఘం అధికారులు ఇలాంటి ఘటనలపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది ఇలావుండగా, ఉఖ్రుల్ జిల్లాలో గత మంగళవారం మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) బహిరంగ సభ సందర్భంగా సాయుధ దుండగులు కాల్పులు జరిపారు. మంగళవారం కాంగ్రెస్ భవన్‌లో ఎంపీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర మాట్లాడుతూ.. ఉఖ్రుల్ జిల్లా (ఔటర్ మణిపూర్ నియోజకవర్గం) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భావిస్తున్న ఆల్ఫ్రెడ్ కన్ంగమ్ ఆర్థర్‌పై చింగై అసెంబ్లీ నియోజకవర్గంలోని టీనెమ్ గ్రామంలో జరిగిన సమావేశంలో సాయుధ దుండగులు దాడి చేశారని తెలిపారు.

ఉఖ్రుల్‌లోని పవోరీ షిరుయ్ గ్రామంలోని టికె ఉడ్‌ల్యాండ్ రిసార్ట్‌లో మాజీ ఎమ్మెల్యే ఆల్ఫ్రెడ్‌పై సోమవారం కూడా సాయుధ దుండగులు దాడి చేశారు. దాడుల అనంతరం ఉఖ్రుల్ జిల్లా ఔటర్ నియోజకవర్గం అభ్యర్థికి భద్రతా చర్యలు చేపట్టాలని మణిపూర్ ఎన్నికల ప్రధాన అధికారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంపీసీసీ కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+