బెంగళూరు మమ్మల్ని చావుకు చేరువ చేస్తోంది..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం..!!

బెంగళూరు నగరంలోని కాలుష్యం పెరుగుతున్న కారణంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నామని, ఇక్కడ ఉండలేమని ఓ యువజంట నిర్ణయించుకుంది. ఆ దంపతులు తమ అనుభవాలను ఒక వీడియో ద్వారా తెలియజేయగా అది వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఆశ్విన్, అపర్ణ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో రెండు సంవత్సరాలు నివసించారు. వారిద్దరి వయస్సు 27 సంవత్సరాలు. నగరంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా తమ ఆరోగ్యం క్షీణిస్తోందని వారు తెలిపారు. ఈ విషయాన్ని వివరిస్తూ వారు ఒక వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బెంగళూరు వాతావరణం, అక్కడి ప్రజలు అంటే ఎంతో ఇష్టమని, కానీ గాలి కాలుష్యం కారణంగానే నగరాన్ని విడిచి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గాలి కాలుష్యం కారణంగా అనారోగ్యం

బెంగళూరు మమ్మల్ని నెమ్మదిగా చంపేస్తోంది. ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు. మమ్మల్ని ధ్వేషించవచ్చు. కానీ వాస్తవం ఇదే.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా తాము తరచూ అనారోగ్యం పాలవుతున్నామని తెలిపారు. బెంగళూరు వచ్చాక తనకు శ్వాస సంబంధిత సమస్యలు, అలర్జీలు వచ్చాయని అశ్విన్ చెప్పారు. తాను సాధారణంగా అనారోగ్యం బారిన పడనని, కనీసం జలుబు కూడా చేయదరని, బెంగళూరు వచ్చిన తరువాత దగ్గు, తుమ్ములు పట్టుకున్నాయని అపర్ణ అన్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామg చేయడం వంటి జీవనశైలి మార్పులు చేసినప్పటికీ వారి ఆరోగ్య సమస్యలు మెరుగుపడలేదు. దీంతో నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.

బెంగళూరులో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ప్రజలు చెబుతుంటారు. కానీ నిజంగానే ఇక్కడ స్వచ్ఛమైన గాలి ఉందా? అని అపర్ణ ప్రశ్నించారు.

ఫిబ్రవరి నెలలో ఏక్యూఐ 297కి చేరుకుంది. ఈ స్థాయిలో ఏక్యూఐ ఉందంటే డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ జంట బెంగళూరును విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది.

"నిజంగా నమ్మ బెంగళూరు అద్భుతమైన నగరం. వ్యాపారం చేసుకోవడానికి కూడా ఇది బెస్ట్ సిటీ. వాతావరణ కాలుష్యం వల్ల వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం.. అని వారు వీడియోలో పేర్కొన్నారు.

వారి పని, స్నేహితులు బెంగళూరులో ఉన్నప్పటికీ ఆరోగ్యం దృష్ట్యా నగరాన్ని విడిచి వెళ్లక తప్పలేదని వారు చెప్పారు.

ఈ వీడియోకు దాదాపు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొంతమంది ఆ జంట వాదనను సమర్థిస్తుండగా, మరికొందరు వారి నిర్ణయంతో విభేదిస్తున్నారు.

బెంగళూరు నగర జనాభా విపరీతంగా పెరగడానికి, ఇక్కడి వాతావరణం కాలుష్యమయం కావడానికి మీరే కారణమని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. "మీరు వెళ్లిపోయినందుకు ధన్యవాదాలు. మాకు కాస్త పరిశుభ్ర గాలి లభిస్తుందని మరో యూజర్ ఈ వీడియోకు బదులిచ్చాడు. మరికొందరు మాత్రం ఆ జంట అభిప్రాయాలతో ఏకీభవించారు.

"బెంగళూరులో నివసించే వాళ్లు.. అపర్ణ, అశ్విన్ చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకూడదని, నగరంలో రెట్టింపు అవుతున్న కాలుష్యం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. మన నగరాన్ని సురక్షితంగా మార్చడానికి ప్రయత్నిద్దామని ఓ నెటిజన్ కామెంట్స్ పెట్టాడు. కాలుష్యం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి వారిని ద్వేషించడం సరికాదని చెప్పాడు. అపర్ణ, అశ్విన్ మరో చోటికి వెళ్లి సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నానని మరో యూజర్ రిప్లై ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+