Crime News: గుజరాత్‍లో ఢిల్లీ ఘటన.. కారుతో ఢీకొట్టి 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన దారుణం..

గుజరాత్ లో బైక్ పై వెళ్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త మృతదేహాన్ని కారు 12 కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.

రోడ్డుపైకి వెళ్లామంటే.. ఇంటికి తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. అందుకే రోడ్డెతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటోడు కూడా జాగ్రత్తగా ఉంటేనే ప్రమాదాలు జరగవు. ఒక వేళ్ల మన వల్లే ప్రమాదం జరిగితే ఘటనాస్థిలి నుంచి తప్పించుకునే క్రమంలో మానవత్వాన్ని మరిచిపోతున్నారు. ఢిల్లీలో ఇదే జరిగింది.. స్కూటీపై వెళ్తున్న అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టిన కొందరు దాదాపు 12 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లారు. అయితే ఇది వారు కావాలనే చేసిందిగా తెలుస్తోంది. తాజాగా గుజరాత్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.

కడోదర - బర్డోలి రహదారి

కడోదర - బర్డోలి రహదారి

ద్విచక్ర వాహనం పై వెళ్తున్న సాగర్ పాటిల్, అతడి భార్యను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో పాటిల్ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన అతడి భార్య ఆసుపత్రిలో ఉన్నారు. కడోదర - బర్డోలి రహదారిపై జనవరి 18 రాత్రి సాగర్ పాటిల్, అతడి భార్య అశ్వినీ బెన్ బండిపై వెళ్తున్నారు.వారిని వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా వెళ్లాడు. అయితే కారుకు సాగర్ పాటిల్ చిక్కుకున్నాడు.

12 కిలో మీటర్లు

12 కిలో మీటర్లు

కారు అలానే వెళ్లడంతో అతను మృతి చెందాడు. సుమారు 12 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత మృతదేహాన్ని రోడ్డుపై వదిలి డ్రైవర్ వెళ్లిపోయాడు. కాగా ఘటన స్థలంలో తీవ్రంగా గాయపడిన మృతుడి భార్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తన భర్త ఎక్కడంటూ ఆమె ప్రశ్నించింది. ఆమెతో పాటు భర్త కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని గాలింపు చేపట్టారు.

వీడియో

వీడియో


కొన్ని గంటల తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి 12 కిలోమీటర్ల దూరంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. దీనిని పాటిల్​ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమమైన డ్రైవర్ పట్టుకుంటామని ఓ పోలీస్ అధికారు చెప్పారు. అయితే ప్రమాదానికి సంబంధిన వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్​లో రికార్డు చేసి పోలీసులకు ఇచ్చాడు. ఈ వీడియో అధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+