మతం తెలుసుకోవడానికి ఒంటిపై దుస్తులు విప్పించారు.. దారుణంగా కొట్టారు!!

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మతం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓ దళితుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఒంటిపై దుస్తులు విప్పించారు. విషాదకర విషయం ఏమిటంటే.. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా- బాధిత దళితుడిని లాకప్‌లో బంధించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గొనె జిల్లాలో గల నిమ్రానీ పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. దొంగతనం చేయడానికి వచ్చాడనే అనుమానంతో ఆ దళిత యువకుడిపై ఒక సామాజిక వర్గానికి చెందిన స్థానికులు దాడి చేశారు. చోరీ చేశాడని ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో నిందతుల్లోని ఒకరు ఈ ఉదంతం మొత్తాన్నీ తన సెల్ ఫోన్‌లో బంధించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

A Dalit man was assaulted by a mob in Khargone of Madhya Pradesh to check religious identity

ఆ యువకుడిని పట్టుకుని ఏ మతం అని ప్రశ్నించడం ఈ వీడియోలో రికార్డయింది. మతం తెలుసుకోవడానికి అతని దుస్తులు విప్పండి అంటూ మరొకడు ఆదేశించాడు. బలవంతంగా దుస్తులు విప్పించారు. అనంతరం- వాడు హిందువు అంటూ గట్టిగా అరవడం ఈ వీడియోలో వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది పోలీసుల దృష్టికి చేరినప్పటికీ.. బాధిత దళిత యువకుడిపై కేసు పెట్టారు. ఖల్టంక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. దీనిపై జిల్లా ఎస్పీ ధరంవీర్ సింగ్ స్పందించాడు. ఖల్టంకా పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర సింగ్ బఘెల్‌పై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా రాజేంద్ర సింగ్ బఘేల్.. బాధితుడిని జైలుపాలు చేశారంటూ తనకు ఫిర్యాదులు అందాయని అన్నారు. బఘేల్‌తో పాటు దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+