వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ జలాలు: రాహుకాలంలో సమావేశాలు వద్దు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడానికి శుక్రవారం కర్ణాటక ఉభయ సభల సమావేశాలు నిర్వహించనున్నారు. రాహుకాలంలో వద్దని, 12 గంటలపైన సమావేశాలు నిర్వహించాలని జేడీఎస్ పార్టీ నాయకుడు హెచ్.డీ. రేవణ్ణ ప్రభుత్వానికి మనవి చేశారు.

ఈ సమావేశాల్లో అన్నీ పార్టీల శాసన సభ్యులు కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యరాదని ఉభయ సభల సాక్షిగా డిమాండ్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. శుక్రవారం ఉదయం విదాన సౌధలోని కెంగల్ హనుమంతయ్య విగ్రహం ముందు జేడీఎస్ పార్టీకి చెందిన తిరుగుబాటు శాసన సభ్యులు ధర్నానిర్వహించారు.

A decision regarding Cauvery water release to Tamilnadu

తమిళనాడుకు వారం రోజులు కావేరీ జలాలు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించలేమని, మాకే నీళ్లు లేవని కర్ణాటక ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్బంలో గవర్నర్ అనుమతితో శుక్రవారం ఉభయ సభలు నిర్వహిస్తున్నారు. శాసన సభ, విదాన సభలో సభ్యులు అందరూ కలిసి తమిళనాడుకు నీరు విడుదల చెయ్యరాదని ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

English summary
September 23rd a special session called in Karnataka assembly to take a decision regarding Cauvery water release to Tamilnadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X