నా కొడుకుని కాపాడండి: రైల్వే మంత్రికి ట్విట్టర్‌లో ఓ తండ్రి
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ మంత్రివర్గంలో ట్విట్టర్ ద్వారా ఏదైనా సమస్యను తెలియజేస్తే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తక్షణమే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు రైల్వే ప్రయాణికులు సమస్యలో ఉన్నప్పుడు మీకు నేను అండగా ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు.
ఆపదలో ఉన్న ఓ ప్రయాణికుడి ట్వీట్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించి 20 నిమిషాల్లో సహాయం అందించిన సంఘటన మార్చి 31న ఉత్తర భారతదేశంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఢిల్లీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న రైలులో బిభుటి అనే ప్రయాణికుడి ఆరేళ్ల కుమారుడు పైబెర్త్ నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది.
@sureshpprabhu @RailMinIndia it's bleeding..pls help..atleast bandage
— Bibhuti (@goneinseconds) 31 March 2016
దీంతో బిభుటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖను ట్విట్టర్ ద్వారా సహాయం కోరాడు. 20 నిమిషాల్లో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందించింది. ముందుగా అతడి ఫోన్ నెంబర్ తీసుకుని రైలు లూథియానా స్టేషన్‌కు రాగానే బాలుడిడికి వైద్య సహాయం అందించారు.
@goneinseconds Kindly share your Mobile no.that we may assist you.
— Ministry of Railways (@RailMinIndia) 31 March 2016
@goneinseconds Matter forwarded to the concerned official @Drmfzr required medical help as train reaching LDH Stn.
— Ministry of Railways (@RailMinIndia) 31 March 2016
@RailMinIndia @goneinseconds Forwarded to the concerned officials @srdomfzr , @cmsfzr & @drspshrama for necessary and immediate action.
— Firozpur Division (@drmfzr) 31 March 2016
@drmfzr @RailMinIndia @goneinseconds @srdomfzr @cmsfzr information given to ludhiana medical team
— Dr S P Sharma (@drspsharmafzr) 31 March 2016
దీంతో రైల్వే ప్రయాణికుడు బిభుటి రైల్వే శాఖ అద్భుతమైన సపోర్టుని అందించారని సురేశ్ ప్రభు, రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా రైల్వే శాఖ ప్రయాణికులు ట్వీట్ల ఆధారంగా సహాయం అందించిన సంఘటనలు చాలానే చూశాం.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications