Viral Video: ట్రాఫిక్ పోలీసును కారు బానట్‌పై లాక్కెళ్లిన డ్రైవర్.. అదీ 4 కిలోమీటర్లు.. వీడియో వైరల్..
జరిమానా చెల్లించాలని కోరిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణం తీసినంత పని చేశాడు ఓ వ్యక్తి. సోమవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో సత్యసాయి కూడలిలో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ఇది గమించిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ్ సింగ్ చౌహాన్ కారు ఆపి ఫైన్ కట్టాలని కోరాడు. దీంతో కారు యజమాని, హెడ్ కానిస్టేబుల్ కు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో
హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ చౌహాన్ మాట్లాడుతూ
యజమాని కారు ఎక్కాడు.. అదే సమయంలో శివ్ సింగ్ చౌహాన్ బానెట్ పై కూర్చున్నాడు. దీంతో అతను కారును ముందుకు పొనిచ్చాడు. ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు వరకూ కారు నడుపుకుంటూ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు చెప్పారు.
కేసు నమోదు
నిందితుడు పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (ర్యాష్ డ్రైవింగ్), 332 (స్వచ్ఛందంగా డ్యూటీలో ఉన్న పబ్లిక్ సర్వెంట్‌ను గాయపరచడం) ఇతర సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసినట్లు లసుడియా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఎస్ దండోటియా తెలిపారు. గ్వాలియర్‌కు చెందిన నిందితుడి వద్ద నుంచి పిస్టల్, రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

లైసెన్స్
"ఈ ఆయుధాలకు లైసెన్స్ ఉందని నిందితుడు పేర్కొన్నాడు మేము దానిని పరిశీలిస్తున్నాము" అని అధికారి తెలిపారు.
"సత్యసాయి స్క్వేర్‌లో డ్యూటీలో ఉండగా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నందున నేను కారును ఆపాను. నిబంధనను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని నేను అతనికి చెప్పినప్పుడు, అతను నిరాకరించాడు" అని హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ చౌహాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications