‘మద్యం తాగి వాహనం నడిపేవారు.. ఆత్మాహుతి బాంబర్లే’
న్యూఢిల్లీ: మద్యం సేవించి వాహనం నడిపేవారు ఆత్మాహుతి బాంబర్‌లాంటివారే అని ఢిల్లీ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన ఢిల్లీకి చెందిన ఓ ఆటోడ్రైవర్‌కు కోర్టు 20 రోజుల జైలుశిక్ష విధించింది.
తాను మొదటిసారి తప్పు చేశానని పేర్కొంటూ.. జైలుశిక్షను రద్దు చేయాలని కోరుతూ అడిషనల్ సెషన్స్‌కోర్టును సదరు ఆటోడ్రైవర్ ఆశ్రయించాడు. ఈ కేసును మంగళవారం విచారించిన జడ్జి వీరేందర్ భట్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. రద్దీ ఉండే సమయంలో మద్యం తాగి వాహనం నడుపడం తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు.

కాగా, రాష్ డ్రైవింగ్ చేస్తూ శిక్షలకు గురైన వారు తమ సంపదను, అధికారాన్ని ఉపయోగించి తమకు పడిన శిక్షలను తక్కువగా చేసుకుంటున్నారని సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications