స్కూల్లోనే మినీ బార్; తాగి తూలుతూ లేడీ టీచర్ పాఠాలు.. ఆపై ఏం జరిగిందంటే!!
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదారి పడుతున్నారు. పిల్లలు పెడదారిన పడకుండా కాపాడాల్సిన ఉపాధ్యాయులే ఫుల్లుగా మద్యం సేవించి విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి పాఠశాలలకు వస్తున్నారు. అందునా ఒక మహిళా ఉపాధ్యాయిని ఫుల్లుగా మద్యం సేవించి విద్యార్ధులకు పాఠాలు బోధించడం, ఏకంగా స్కూల్ లోనే ఒక బార్ ఏర్పాటు చేసుకోవడం తాజాగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే

తాగి పాఠాలు చెప్తున్న మహిళా టీచర్
కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు తాలూకా చిక్కసారంగిలో ప్రాధమిక ప్రభుత్వ పాఠశాలలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న గంగ లక్ష్మమ్మ అనే మహిళా ఉపాధ్యాయిని మద్యానికి బానిస అయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా ఆమె మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యాబోధన చేస్తున్నారు. మద్యం సేవించిన తర్వాత విద్యార్థులను అకారణంగా తిట్టడం, కొట్టడం, ఇక ఇతర ఉపాధ్యాయులతో వాగ్వివాదాలకు దిగడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది.

తాగుబోతు టీచర్ వద్దంటూ స్కూల్ కు తాళం వేసి ఆందోళన
ఎన్నోసార్లు స్కూల్ లోని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మందలించినా ఆమె తీరు మారలేదు. నిత్యం మద్యం సేవించి పాఠాలు చెప్పడానికి తరగతికి వెళ్తున్న ఆమె తీరుపై విసిగి పోయిన వారు పాఠశాలకు తాళాలు వేశారు. ఉపాధ్యాయినికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ తాగుబోతు టీచర్ మాకు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . దీంతో ఈ విషయం తెలిసిన విద్యాశాఖాధికారి హనుమానాయక్ అక్కడికి చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడారు.

ఉపాధ్యాయిని టేబుల్ డ్రాలో మినీ బార్...
నిత్యం మద్యం సేవిస్తూ వస్తున్న ఉపాధ్యాయిని టేబుల్ డ్రాను పరిశీలించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆమె దానిని అడ్డుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, టేబుల్ డ్రా తాళం విరగ్గొట్టి చూడగా అందులో ఒక మినీ బార్ కనిపించింది. ఏకంగా స్కూల్లోకే మద్యం సీసాలను తెచ్చి స్టాక్ పెట్టుకొని మరీ స్కూల్లోనే మద్యం సేవిస్తున్న సదరు మహిళా ఉపాధ్యాయిని తీరు విద్యాశాఖ అధికారికి షాక్ ఇచ్చినంత పని అయింది.

సూసైడ్ చేసుకుంటానని హంగామా.. టీచర్ సస్పెండ్, విచారణకు ఆదేశం
ఇక ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గంగలక్ష్మమ్మ, భోరున ఏడుస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని నానా హంగామా సృష్టించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను అదుపులోకి తీసుకుని, మద్యం సీసాలను సీజ్ చేశారు. ఇక మద్యం సేవించి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయినిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అంతేకాదు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తాగుబోతు మహిళా టీచర్ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు టీచర్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications