సోషల్ మీడియాలో ఐఏఎస్ రవికి పూర్తి మద్దతు

బెంగళూరు: సమర్థవంతమై అధికారిగా పేరు తెచ్చుకుని అనుమానస్పదస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారికి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. పార్టీలకు అతీతంగా కోలారు జిల్లా, కుణిగల్, హులియూరు దుర్గలో స్వచ్చందంగా బంద్ నిర్వహించారు. ఎక్కడ చూసినా రవి చిత్రపటాలు, బ్యానర్లు ఎర్పాటు చేసి నివాళులు అర్పించారు.

సోషల్ మీడియాలో రవి అభిమానుల సంఘం అంటు మంగళవారం ఫేస్ బుక్, ట్విట్టర్లలో రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతున్నారు. ఐఏఎస్ అధికారి రవిది ఆత్మహత్య కాదు.... హత్య అంటు బహిరంగంగా మండిపడుతున్నారు. నిజాయితి కలిగిన అధికారికి ఇదేనా శిక్ష ? అని ప్రశ్నించారు.

మీ ప్రభుత్వంలో నీతి నిజాయితిగా పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి శిక్షలు పడినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు అని సీఎం సిద్దరామయ్యను ప్రశ్నించారు. నీలాంటి నిజాయితి పరుడికి ఈ లోకంలో చోటు లేదు... హాయిగా వెళ్లిరా నేస్తామా అంటూ రవి పేరుతో బ్యానర్లు కట్టి ఆయనకు విడ్కోలు పలుకుతున్నారు. మంగళవారం విక్టోరియా ఆసుపత్రి దగ్గర రవి అభిమానులు ధర్నా నిర్వహించారు.

అందరికి సూర్యోదయం........!

అందరికి సూర్యోదయం........!

ఈ రోజు అందరు నిద్రలేచి సూర్యోదయం చూశారు. అయితే రవి ఇంటిలో దీపం ఆరిపోవడంతో వారి జీవితాలలో చీకటి మిగిలింది. రవి మరణానికి కారణం అయిన వారికి దారుణమైన చావు వస్తుందని బ్యానర్లు కట్టారు.

ఇది కచ్చితంగా హత్య.........!

ఇది కచ్చితంగా హత్య.........!

ఈ వ్యవస్థలో నిజాయితిగా ఉంటే పలువురు జీర్ణించుకొలేరు. మీరు అధికారం దుర్వనియోగం చెయ్యలేదు. నిద్రలేచినప్పటి నుండి పేదల కొసం, వారి కష్టాలు తీర్చడం కొసం శ్రమించారు. చివరికి మీ కుటుంబానికి కష్టాలు మిగిల్చి వెళ్లిపోయారు.

మా దేవుడిని కడసారి చూడనివ్వండి...........!

మా దేవుడిని కడసారి చూడనివ్వండి...........!

మంగళవారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఐఏఎస్ అధికారి రవి అభిమానులు విక్టోరియా ఆసుపత్రి దగ్గర బ్యానర్లు ఎర్పాటు చేసి నివాళులు అర్పించారు. మా కష్టాలు తీర్చిన రవి సార్ ను కడసారి చూసుకొవడానికి అవకాశం ఇవ్వాలని పోలీసులతో గొడవపడ్డారు.

తరలి వచ్చిన యువత............!

తరలి వచ్చిన యువత............!

ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పదస్థితిలో మరణించారని తెలుసుకున్న కోలారు జిల్లాలోని యువత పెద్ద సంఖ్యలో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి దగ్గరకు చేరుకున్నారు. తరువాత ఫ్లెక్సీలు ఎర్పాటు చేసి శ్రద్దాంజలి ఘటించారు.

కుణిగల్ తాలుకాలో విషాదచాయలు........!

కుణిగల్ తాలుకాలో విషాదచాయలు........!

రవి సోంత గ్రామం అయిన కుణిగల్ తాలుకా హులియూరుదుర్గలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అంచలంచెలుగా ఎదిగిన రవి ఒక్క సారిగా అందరికి దూరం అయ్యాడని వారు జీర్ణించుకొలేకపోతున్నారు. కుణిగల్ తాలుకా మొత్తం శ్రద్దాంజలి ఫ్లెక్సీలు ఎర్పాటు చేశారు.

దలితురాలి ఇంటిలో సంగటి...... పచ్చడితో బోజనం

దలితురాలి ఇంటిలో సంగటి...... పచ్చడితో బోజనం

కోలారు జిల్లాధికారిగా పని చేసిన రవి, తన భార్య కుసుమాతో కలిసి కోలారులోని గాంధీనగరలోని మునియమ్మ అనే మహిళ ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. వారు చేసుకున్న సంగటి, పచ్చడితో భోజనం చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ముందుగా చెబితే వంటలు చేస్తారని ఆయన ఎవ్వరికి సమాచారం ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+