Air India: ప్రయాణికురాలికి తేలు కాటు.. అదీ విమానం గాల్లో ఉండగా..

సాధారణంగా పాములు, తేళ్లు ఎక్కువగా ఎక్కడుంటాయి.. అడవిలో ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తాయి. పాముల కంటే తేళ్లు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తుంటాయి. కాటు వేస్తుంటాయి. ఇది కామన్.. కానీ గాల్లో వెళ్తున్న విమానంలో తేలు కుడితే.. అవును ఇది నిజంగానే జరిగింది. గాల్లో ఎగురుతున్న విమానంలో ఓ ప్రయాణికురాలికి తేలు కుట్టింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నాగ్ పూర్ ముంబై మధ్య జరిగింది.

ఏప్రిల్ 23న ఈ ఘటన జరిగినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఆరోజు నాగ్‌పూర్‌ నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలికి తేలు కుట్టిందని పేర్కొంది. ఆమెకు చికిత్స అందించామని.. ప్రమాదం నుంచి బయట పడిందని తెలిపింది. విమానంలో పక్షులు, ఎలుకలు కనిపించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక ప్రయాణికురాలికి తేలు కుట్టడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.

A female passenger on a flying plane was stung by a scorpion

"ఏప్రిల్ 23, 2023న మా ఫ్లైట్ AI 630లో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి తేలు కుట్టిన అత్యంత అరుదైన, దురదృష్టకర సంఘటన జరిగింది" అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. మహిళా ప్రయాణీకురాలికి వెంటనే వైద్య చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆసుపత్రికి తరలించారని చెప్పారు. విమానం ల్యాండింగ్ కాగానే ప్రయాణికురాలని విమానాశ్రయంలోని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.

ప్రయాణికురాలు ఆస్పత్రి చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తమ అధికారులు ప్రయాణిరాలితో పాటు ఆసుపత్రికి వెళ్లారు. డిశ్చార్జ్ అయ్యే వరకు ఆమెకు సహాయాన్ని అందించారని ఎయిరిండియా ప్రతినిధి వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ బృందం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది.

"మా బృందం ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానం పూర్తి తనిఖీని నిర్వహించింది. తేలను గుర్తించింది.ప్రయాణికురాలికి కలిగిన బాధ, అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము" అని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదివరకే ఎయిర్ ఇండియాలో ఇలాంటి ఘటనలు జరగటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+