నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ హ్యాకింగ్
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైయ్యింది. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం నిర్మలా సీతారామన్ అధికారిక ట్విట్టర్ ను హ్యాక్ చేసిన నిందితులు ఓ ప్రయివేటు కంపెనీకి చెందిన ఉత్పత్తిని ప్రచారం చేస్తూ పదేపదే అవాంఛనీయమైన సమాచారం పోస్టు చేశారు. నిర్మలా సీతారామన్ ఫాలోవర్లు విషయం గుర్తించి ఆమెకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు.

తన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైయ్యిందని తెలుసుకున్న నిర్మలా సీతారామన్ అప్రమత్తం అయ్యారు. తనను అప్రమత్తం చేస్తూ సమాచారం ఇచ్చిన ఫాలోవర్లకు నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు.
వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రయివేటు కంపెనీ ఉద్యోగులు ఎవరైనా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ చేశారా, లేక ఆకతాయిలు హ్యాకింగ్ చేశారా అని దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైం పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications