ఐటీ హబ్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర ఏం జరిగిందంటే ?, ఆంటీ ఇంటిలో ఒక్కసారిగా !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఇటీవల కాలంలో మెట్రో రైలులో సంచరించే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బెంగళూరు నగరంలో నిత్యం ట్రాఫిక్ జామ్ కావడంతో నానా ఇబ్బందులు పడుతున్న నగర ప్రజలు ఇప్పుడు మెట్రో రైలు సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో టిక్కెట్ ధర ఎక్కువ అయినా పర్వాలేదని మెట్రో రైలులో సంచరిస్తున్నారు.
ఇంటి సమీపంలోని మెట్రో రైల్వే స్టేషన్ లలో బైక్ లు పార్క్ చేసి తరువాత మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. పని ముగించుకున్న తరువాత మళ్లీ మెట్రో రైలులో బైక్ లు పార్క్ చేసిన మెట్రో రైల్వే స్టేషన్ చేరుకుని తరువాత వారి బైక్ లు, కార్లు తీసుకుని ఇంటికి వెలుతున్నారు. బెంగళూరు నగరంలోని ప్రతి మెట్రో స్టేషన్ లో బైక్ లు, కార్లు పార్క్ చెయ్యడానికి పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు.

బెంగళూరు నగరంలోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉదయం అగ్నిప్రమాదం జరిగి 4 బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈరోజు (జనవరి 16) ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనాలు నిలిపిన చోట మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మూడు స్కూటీలు, ఒక బైక్ దగ్ధం అయ్యాయి. స్థానిక ప్రజలు చూస్తుండగానే మంటలు చెలరేగి నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధం అయ్యి కాలి బూడిద అయిపోయాయి.
అయితే ఇంతవరకు అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేశారు. బైక్ లకు ఎవరైనా నిప్పు అంటించారా ? అనే అనుమానం రావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరులోని ఓ ఇంట్లోని సిలిండర్ పేలి ఏడుగురికి గాయాలైన ఘటన నగరంలోని యలహంకలోని ఎల్‌బీఎస్ లేఅవుట్‌లో చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో యలహంక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఢిల్లీకి చెందిన హస్మా బాను బెంగళూరు నగరం చేరుకుని ఇక్కడ ఇంటి పనులు చేస్తూ జీవిస్తోంది. హస్మా బాను ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది.
ఈ ప్రమాదంలో సల్మా, షాహిద్ సహా ఐదుగురికి గాయాలయ్యాయి. పసియా భాను, హస్మా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో షార్ట్‌సర్క్యూట్ కూడా జరిగి విద్యుత్ ప్రవాహానికి గురై గాయపడ్డాడు. సిలిండర్ పేలుడు తీవ్రతకు ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి. యలహంక పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications