ఎమ్మెల్యేలు ఎవరివైపు?: రహస్య ఓటింగ్‌కు పన్నీరు పట్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుంటున్నాయి. శనివారం నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం, శశికళ అనుచరుడు, సీఎం పళనిస్వామి వర్గీయుల మధ్య పవర్ గేమ్ కనిపిస్తోంది.

శుక్రవారం నాడు పన్నీరు సెల్వం వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ధనపాల్‌ను కలిశారు. బలనిరూపణకు రహస్య ఓటింగ్ నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు.

పదవి నుంచి తొలగింపు: శశికళకు పన్నీరు వర్గం నేత షాక్, చెల్లుతుందా?

మరోవైపు, పళనిస్వామి వర్గీయుడైన ప్రభుత్వ చీఫ్ విప్ రాజేంద్రన్ 134 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. పళనిస్వామికి ఓటు వేయాలని ఆయన విప్ జారీ చేశారు. అయితే, పలువురు ఎమ్మెల్యేలు మాత్రం పన్నీరుకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

A floor test will push Panneerselvam's CM dreams farther away

ఇదిలా ఉండగా, గోల్డెన్ బే రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 40 మంది సభ్యులు ముఖ్యమంత్రి పళనిస్వామికి ఎదురు తిరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో సీనియర్ నేతలు వారిని బుజ్జగిస్తున్నారు. ఫ్లోర్ టెస్టులోను పన్నీరు గెలిచే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.

శశికళని తమిళనాడు తరలించాలి: స్వామి, పన్నీరే సీఎంగా ఉండాలని..

గురువారం ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్ భవన్ వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేల వాహనాల పైన ఊసి, విమర్శలు గుప్పించారు. ఇది ఆసక్తికరంగా మారింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో భయం కలిగిన ఎమ్మెల్యేలు పలువురు పళనిస్వామి పైన తిరుగుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, పళనిస్వామి - పన్నీరు సెల్వం వర్గీయులు అసలైన పార్టీ తమదేనని చెబుతున్నారు. ఇప్పటికే శశికళన్, దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరిస్తున్నట్లు పన్నీరు వర్గం నేత మైత్రేయన్ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A floor test will push Panneerselvam's CM dreams farther away.
Please Wait while comments are loading...