ప‌ద్నాలుగేళ్ల బాలిక తండ్రి కోసం.. 35 కిలోమీట‌ర్లు రిక్షా తొక్కింది...

తండ్రి, కూతుళ్ల ప్రేమ వెలకట్టలేనిది. కూతురు ఎక్కడున్నా.. ఆ తండ్రి మనసు ఆమె కోసమే ఆలోచిస్తుంది. ఆ కూతురి మనసు తండ్రి పలకరింపునే కోరుకుంటుంది. తండ్రులకు కూతుళ్ల మీద ఉండే ప్రేమ అనిర్వచనీయమైనది. ప్రతి అమ్మాయిల‌కు మొదటి స్నేహితుడు క‌న్న‌తండ్రి. అందుకే చాలామంది అమ్మాయిలకు తండ్రుల‌నే ఎక్కువగా ఇష్ట‌ప‌డుతుంటారు. వారి విష‌యాల‌న్నీ తండ్రుల‌తోనే షేర్ చేసుకుంటుంటారు. ఇలాంటి కోవ‌కు చెందినదే ఒడిశాలోని ఓ బాలిక‌. త‌న తండ్రి మీద ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఒక్క ఈ విష‌యంతో అర్థ‌మ‌య్యిపోయింది. ఓ ప‌ద్నాలుగేళ్ల బాలిక తండ్రి కోసం ఏకంగా 35 కిలోమీట‌ర్లు రిక్షా తొక్కి తండ్రిపై త‌న‌ ప్రేమ‌ను చాటుకుంది.

తండ్రిని కాపాడుకునేందుకు : ఈ హృదయవిదారక ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. ఓ 14 యేళ్ల బాలిక 35 కిలోమీట‌ర్లు రిక్షా తొక్కుతూ తండ్రిని ఆస్పత్రికి తీసుకువెళ్లింది. ఒడిశాకు చెందిన శంభునాథ్ అక్టోబర్ 22న జరిగిన గ్రూపు ఘ‌ర్ష‌ణ‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆ విష‌యం తెలుసుకున్నఅత‌ని కూతురు సుజాత తండ్రి కాపాడుక‌నేందుకు ఆ గ్రామాంలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లింది. అయితే, అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు భద్రక్ డీహెచ్‌హెచ్‌కి తరలించాలని ఆ బాలికకు తెలిపారు. అక్క‌డినుండి తండ్రిని ఆసుప‌త్రికి తీసుకెళ్లాంటే ఏదో ఒక ప్ర‌యివేట్ వాహ‌నం మాట్లాడుకోవాలి.

A fourteen-year-old girl rode a rickshaw for 35 kilometers for her father.

ప్ర‌యివేట్ వాహ‌నం కావాలంటే డ‌బ్బుకావాలి. తండ్రిని ఆసుప్ర‌తికి తీసుకెళ్లేందుకు ఆమె చేతిలో చిల్లిగ‌వ్వ కూడా లేదు. స‌హ‌యం చేసేవారు లేరు. అంబులెన్స్ ఫోన్ చేసేందుకు త‌న ద‌గ్గ‌ర ఫోన్ కూడా లేదు. దాంతో ఏం చేయాలో పాలుపోకా ఆ బాలిక తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాల‌నే సంక‌ల్పంతో తండ్రి న‌డిపే రిక్షాలో 35 కిలోమీట‌ర్లు ఆయ‌న్ను తీసుకెళ్లింది. అయితే ఈ సంఘ‌ట‌న అక్టోబర్ 23 న జరిగింది. భద్రక్ పట్టణంలోని మోహతాబ్ చక్ సమీపంలో ఆ బాలిక రిక్షా తొక్కుతూ, అక్క‌డి స్థానికులు,, జ‌ర్న‌లిస్టులు బాలిక‌ను గుర్తించి అడ‌గ‌గా, అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

వీరిద్ద‌రు నడిగన్ గ్రామానికి చెందిన వారు."నా వద్ద ప్రైవేట్ వాహనాన్ని అద్దెకు తీసుకోవడానికి డబ్బు లేదు. అంబులెన్స్‌కు కాల్ చేయడానికి మొబైల్ ఫోన్ లేదు. కాబట్టి, నేను మానాన్నను ఆసుపత్రికి తీసుకురావడానికి మా నాన్నతొక్కే ట్రాలీనే ఉపయోగించాను. అని ఎంతో ధీనంగా చెప్పింది సుజాత‌.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+