చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తన ఇష్టం వచ్చిన చదువుకోసం తండ్రిపై కేసు పెట్టిన విద్యార్థిని.. జర్నలిజం కోసం

|
Google Oneindia TeluguNews

నేను జర్నలిజం లేదా లాయర్ చదువుతా...లేదు నువ్వు ఆ ఉద్యాగాలు చేయలేవు, సైన్స్ కోర్సులు మాత్రమే చదవాలి అంటూ ఓ తండ్రి కూతురు మధ్య జరిగిన సంభాషణ ఇలాంటీ సంభాషణలు అకడమిక్ ఇయర్ వచ్చిందంటే లక్షలాదీ మంది ఇళ్లలో తల్లిదండ్రులు ,వారి సంతానం మధ్య సంబాషనలు కొనసాగుతుంటాయి..పదవ తరగతి నుండి ఆపై చదువులు చదివేందుకు అటు విద్యార్థులకు ఒక అభిప్రాయం ,వారిని పెంచి పోషించిన తల్లిదండ్రులకు మరోక అభిప్రాయం ఉంటుంది. ఇలా ఇద్దరి మధ్య అంతర్గత ఇబ్బందులు కూడ తలెత్తుతాయి..దీంతో ఎవరో ఒకరు చెప్పింది విని సంతృప్తిగానే లేక అసంతృప్తిగానో తమ చదువులు కొనసాగిస్తుంటారు విద్యార్థులు.

చెన్నై విద్యార్ధిని వింత సంఘటన..

చెన్నై విద్యార్ధిని వింత సంఘటన..

చెన్నైకి చెందిన 17 సంవత్సరాల విద్యార్థి మాత్రం తాను అనుకున్నదే సాధించేందుకు తన తండ్రిపైనే ఫిర్యాదు..తనకు ఇష్టం వచ్చిన చదువు సహకరించడం లేదంటూ చైల్డ్‌హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసింది..వివరాల్లోకి వెళితే పదవ తరగతిలో స్కూల్ టాపర్‌గా ఉన్న ఆ విద్యార్థిని ఇంటర్‌లో మాత్రం తల్లిదండ్రుల ఇబ్బంది పెట్టడడంతో 65 శాతం మార్కులను సాధించింది.

నేను జర్నలిజం చేస్తా...లేదు టీచర్ కావాలి...

నేను జర్నలిజం చేస్తా...లేదు టీచర్ కావాలి...

ఇక పై చదువులకు సంబంధించి విద్యార్థిని జర్నలిజం కోర్సు చేస్తానని చెప్పడంతో దానికి తండ్రి ఒప్పుకోలేదు. అందులో భవిష్యత్ ఉండదంటూ చెప్పాడు. మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే సైన్స్ కోర్సులు చదివి టీచర్ ఉద్యోగం చేయాలని తండ్రి సూచించాడు ...ఇలా చాలా రోజులు ఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తన కూతురు మాట వినడం లేదని ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ తోపాటు ఇతర సర్టిఫికెట్స్ ను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. తాను చెప్పిన కోర్సులను చదువుకుంటేనే సర్టిఫికెట్స్ ఇస్తానని మొండికేశాడు. అప్పటికే తన తోటీ విద్యార్థులు అడ్మిషన్లను ఖారారు చేసుకోవడం ఓవైపు సర్టిఫికేట్స్ లేక సదరు విద్యార్ధిని ఇబ్బందులకు గురైంది.

చెన్నై చైల్డ్‌లైన్ 1098కి ఫోన్..

చెన్నై చైల్డ్‌లైన్ 1098కి ఫోన్..

అయితే తాను అనుకున్న చదువును సాధించి తీరాలని భావించిన విద్యార్థిని చేసేదేమీ లేక రాష్ట్ర్రంలోని చైల్డ్‌లైన్ 1098కి ఫోన్ చేసింది. తాను చదువుకునేందుకు తండ్రి అడ్డుపడడంతోపాటు తన సర్టిఫికెట్స్‌ను ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో చైల్గ్‌లైన్ అధికారులు విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చెపట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఇక విద్యార్థిని తల్లి గురించి మాట్లాడుతూ తన తల్లికి చదువుపై ఎక్కువ అవగహన లేదని, ఆమే హౌస్‌వైఫ్ గా ఉంటుందని తెలిపింది.

 భవిష్యత్ లో ఇలాంటీ కేసులు కూడ ఉంటాయా..

భవిష్యత్ లో ఇలాంటీ కేసులు కూడ ఉంటాయా..


సో మొత్తం మీద చదువు కోసం రానురాను పిల్లలు , వారి తల్లిదండ్రుల మధ్య ఇలాంటీ కేసులు కూడ వచ్చే అవకాశాలు ఈ సంఘటనను బట్టి తెలుస్తోంది. ఇలాంటీ సమయంలో తల్లిదండ్రులు సామరస్యంగా నచ్చజెప్పి వారికి కావల్సిన భవిష్యత్ గురించి వివరిస్తే తప్ప ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే అవకాశలు మాత్రం కనిపించడం లేదు.

English summary
A girl from Chennai has filed a complaint against her father for not allowing her to pursue an undergraduate college course after completing her Class XII. She wants to study journalism or law, her father wants her to study B.Sc chemistry and choose the teaching profession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X