దారుణం: సోదరితో శారీరక సంబంధం, గర్భం దాల్చడంతో చంపేశాడు

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. సోదరి వరుసయ్యే యువతితో శరీరక సంబంధం ఏర్పరచుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమెకు గర్భం వచ్చిందని తెలిసి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన వేలూరు జిల్లా తిరువలం సమీపంలోని లక్ష్మీపురంలో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు దామోదరన్‌, కర్పగం దంపతులకు అముద (18) అనే కుమార్తె ఉంది. కాగా, కర్పగం అక్క ఏపీలోని కుప్పంలో నివాసముంటున్నారు. ఈమె కుమారుడు శబరి కర్పగం ఇంట్లో ఏడాదిగా ఉంటున్నాడు. దామోదరన్‌, కర్పగంలు ప్రతిరోజు ఉదయం పొలానికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేవారు.

A girl killed by his brother in Tamil Nadu.

కాగా, శబరి, అముదాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వారి మధ్య ప్రేమ ఏర్పడిందని, శారీరకంగా కలవడంతో అముద గర్భం దాల్చినట్లు చెబుతున్నారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని శబరిని అముదా కోరగా.. అన్న వరుస అవుతానని వివాహానికి నిరాకరించాడు. అముదా మాత్రం పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో శబరి సోమవారం తన వద్ద ఉన్న విషం ఇంజక్షన్‌ను అముదాకు వేసి హత్య చేశాడని, తర్వాత ఆమెను ఫ్యాన్‌కు వేలాడదీసి పారిపోయాడు.

రాత్రి 8గంటలు అయినా ఇంటిలోపల లైటు వెలుగక పోవడంతో ఇరుగుపొరుగు వారు తలుపులు తట్టినా తీయకపోవడంతో వారు దామోదరన్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న దామోదరన్‌, కర్పగంలు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా అముద ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో దామోదరన్, కర్పగం దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న తిరువలం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అముద మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అడుక్కంపారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న అక్క కుమారుడు శబరి కనిపించలేదని కర్పగం పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు కరిగిరిలో బంధువుల ఇంటిలో మద్యం మత్తులో ఉన్న శబరిని సోమవారం అరెస్టు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl killed by his brother in Tamil Nadu.
Please Wait while comments are loading...