షాక్ :ఇంటికి వెళ్ళేందుకు మనసొప్పక, ఆమె చేసిందంటే
ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలనే మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకొంది. అయితే తన చావుకు బోయ్ ప్రెండ్ కాని, ఆ కుటుంబసభ్యులు కారణం కాదని ఆమె లేఖ రాసి పెట్టింది.
రోహతక్ :తాను చేసిన పనికి ఏం ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలని అంటూ లేఖ రాసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొంది.అయితే తన కూతురును ఆమె ప్రియుడే చంపేశాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రోహతక్ లో చోటుచేసుకొంది.
రోహతక్ లో పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి స్కూల్ కు వెళ్తున్నానని చెప్పి, గత ఏడాది డిసెంబర్ 11వ, తేదిన బాయ్ ప్రెండ్ తో కలిసి పారిపోయింది. ఆనాటి నుండి ఇంటికి వెళ్ళలేదు.
తన బోయ్ ప్రెండ్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ, అదే సమయంలో కుటుంబసభ్యులంటే కూడ అమితమైన ఇష్టం. వీరిద్దరిని కూడ వదిలి బతకడం కస్టమని ఆమె లేఖ రాసింది.

రోహతక్ లో ఇస్మాయిలా అనే గ్రామంలో రైలు కింద పడి 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె ఓ లేఖ రాసింది. ఆ లేఖలో తన చావుకు ఎవరూ కారణం కాదని తేల్చి చెప్పింది. తన చావుకు బోయ్ ప్రెండ్ కాని, కుటుంబసభ్యులు కాని కారణం కాదని ఆమె ఆ లేఖలో పేర్కొంది. తన సమస్య వల్ల తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకొంటున్నానని చెప్పారు.
తన చావు తర్వాత తన స్నేహితులకు గానీ, బోయ్ ప్రెండ్ కు కాని, అతని కుటుంబానికి ఎలాంటి హని జరగడానికి వీల్లేదని ఆమె కోరుకొంది. వారికి ఎలాంటి సంబంధాలు లేవని ఆమె ఆ లేఖలో పేర్కొంది.












Click it and Unblock the Notifications