మామడి పండు కోసం మర్డర్... ఐదేళ్ల బాలుడిని కళ్లలో పోడిచి చంపిన మరో బాలుడు...!
చిన్న పిల్లల మధ్య ఓ మామిడి పండు తగాదా సృష్టించింది. దీంతో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయాడు. పిల్లలు ఆడుకునే సమయంలో చెలరేగిన ఘర్షనలో తోటి స్నేహితుడి కళ్లు, నెత్తిపై పోడిచి హత్య చేశాడు..అనంతరం పక్కనే ఉన్న చెరువులో పడేసి వెళ్లిపోయిన చత్తీస్‌ఘడ్‌లోని చంపా జిల్లాలో చేటు చేసుకుంది.

మామడి పండు కోసం...
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని చంపా జిల్లాలో దారుణ సంఘటన చేటుచేసుకుంది. కొంతమంది పిల్లలు మామిడి పండ్లు తెప్పి తినేందుకు వెళ్లారు. అయితే అందులో ఒకరు మామడి చెట్టు ఎక్కి పండ్లు తెంపి క్రింద వేస్తున్నాడు. మిగతా వారు వాటిని తీసి ఒక్క దగ్గర వేస్తున్నారు. ఇంతలోనే సాహిల్ అనే బాలుడు ప్రత్యేకంగా చెట్టునుండి క్రింద పడిన మామిడి పండును బుట్టలో వేయకుండా ఒక పండు తిన్నాడని మథుర్ అనే బాలుడు చెప్పాడు. దీంతో చెట్టు ఎక్కి పండ్లను తెంపుతున్న బాలుడు కోపోద్రిక్తుడయ్యాడు..వెంటనే మామిడి పండు తిన్న సాహిల్‌ను తిడుతూ క్రిందకు దిగాడు.

స్క్రూ డ్రైవర్ తో పోడిచి చంపిన తోటి స్నేహితులు
అకస్మాత్తుగా తన వద్ద ఉన్న స్క్రూ డ్రైవర్ తీసీ సాహిల్ తలతోపాటు కళ్లలో పలుసార్లు పోడిచాడు.దీంతో సాహిల్ సృహతప్పి క్రిందపడిపోయాడు. దీంతో పక్కనున్న ఇతర పిల్లలు ఒక్కసారిగా అశ్చర్యానికి గురయ్యారు. రక్తాన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు.. మరోవైపు సాహిల్ తల్లిదండ్రులు తిడుతారనే భయంతో రక్తపు మడుగులో ఉన్న సాహిల్ బాడిని కొంత దూరం వరకు తీసుకు వెళ్లారు..అక్కడ ఉన్న చెరువులో పడేశారు.

అంతా ఏడేళ్ల లోపు వారే
ఇక ఆడుకోవాడానికి వెళ్లిన తమ కుమారుడు సాయంత్రం అయినా ఇంటికి చేరుకోకపోవడంతో సాహిల్ తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు.సాహిల్ తో వెళ్లిన స్నేహితులను ఆరా తీయగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సంచిలో మూటగట్టుకుని కిడ్నాప్ చేసినట్టు కట్టు కథ చెప్పారు. దీంతో వారి మాటలను నమ్మిన తల్లిదండ్రులు పోలీసులకు తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని పిర్యాధు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు చెరువులో గాయాలతో కూడిన సాహిల్ శవం కనపడింది. దీంతో స్నేహితులను విచారించగా అసలు విషయం చెప్పారు. కాగా సాహిల్‌పై దాడి చేసిన అందరు కూడ ఏడు సంవత్సరాల వయస్సు గల పిల్లలే కావడం గమనార్హం.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications