నర్సుల డ్రస్సింగ్ రూంలో హిడెన్ కెమెరా (వీడియో)
న్యూఢిల్లీ: నర్సులు డ్రస్ మార్చుకునే రూంలో హిడెన్ కెమెరా ఎర్పాటు చేసి రికార్డు చేసి ఆ దృశ్యాలు చూస్తున్న నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుడు ఎర్పాటు చేసిన రహస్య కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విదంగా ఉన్నాయి. ఢిల్లీలో రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో సందీప్ కుమార్ మిశ్రా నర్సు (మేల్ నర్స్)గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఆసుపత్రిలో మహిళా నర్సులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యే గది ఎర్పాటు చేశారు.
దుస్తులు మార్చుకునే గదిలో సందీప్ కుమార్ మిశ్రా హిడెన్ కెమెరా ఎర్పాటు చేశాడు. గుట్టుచప్పుడు కాకుండ మహిళా నర్సులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలు రికార్డు చేస్తున్నాడు. తరువాత ఎవ్వరూ లేని సమయంలో హిడెన్ కెమెరా బయటకు తీసుకువస్తున్నాడు.
హిడెన్ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను తన మొబైల్, కంప్యూటర్ లో లోడ్ చేసుకుని చూస్తున్నాడు. ఇటివల ఓ నర్సు ఆ హిడెన్ కెమెరాను గుర్తించి ఆసుపత్రి మేనేజర్ కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చెయ్యగా సందీప్ కుమార్ శర్మా అసలు రంగు బయటపడింది.












Click it and Unblock the Notifications