విడాకులు ఇస్తున్న భార్య, అక్రమ సంబంధం, భర్త ఏం ప్లాన్ చేశాడంటే ? కారు, కిల్లర్ !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపులకు కొడుకు ఉన్నాడు. అయితే అక్రమ సంబంధం అనే విషయంలో గొడవలు మొదలుకావడంతో దంపతులు విడిపోయారు. ఒకే ప్రాంతంలో దంపతులు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. తాను బతకడానికి భరణం కావాలని భార్య కోర్టుకు వెళ్లడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.
కోర్టులో విడాకుల కేసులో విచారణకు హాజరై తిరిగి వస్తున్న మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రయత్నించారు. భరణం అడిగినందుకు భార్యను చంపేయాలని ప్లాన్ చేసిన భర్త పోలీసులకు ఎలా చిక్కిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను వెనకాలే వచ్చిన కారు ఢీకొట్టడంతో పాటు చాలా దూరం లాక్కొని వెళ్లడం కలకలం రేపింది.

తమిళనాడులోని తేని జిల్లా దేవరం ప్రాంతంలో మణిమాల (38) అనే మహిళ నివాసం ఉంటున్నది. మణిమాల దేవారం ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని 15 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇదే విషయంలో అభిప్రాయ బేధాల కారణంగా 9 ఏళ్ల క్రితం భర్త రమేష్ తో విడిపోయిన మణిమాల అదే ప్రాంతంలో ఒంటరిగా ఉంటోంది.
భర్తకు దూరంగా ఉంటున్న మణిమాల బతకడానికి ఇబ్బంది పడింది. 2015లో మణిమాల తన భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. కేసు విచారణకు రమేష్ తో పాటు అతని భార్మ మణిమాల హాజరు అవుతున్నారు. కోర్టు విచారణకు హాజరు అయిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు మణిమాల బస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెలుతోంది. అంతలో వెనుక నుంచి వేగంగా వెళ్లిన కారు మణిమాలను అతివేగంతో ఢీకొట్టింది.
అదృష్టవశాత్తూ గాయాలతో బయటపడ్డ మణిమాలను అక్కడి ప్రజలు రక్షించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పండిత్ రాయ్‌ని పట్టుకున్న స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా మణిమాల మీద ఉద్దేశ్యపూర్వకంగా కారు దూసుకెళ్లినట్లు కనిపించడంతో కారు డ్రైవర్ పండిత్ రాయ్ ని పోలీసులు విచారించారు.

భరణం అడిగినందుకు భార్య మణిమాలను హత్య చేసేందుకు పండిత్ రాయ్ ని ఆమె భర్త రమేష్ హత్య చెయ్యాలని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడని వెల్లడైంది. అనంతరం భార్య మణిమాల మీద కారుతో ఎక్కించి హత్య చేసేందుకు పథకం పన్నిన రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతకుముందు, ఆమె గత నెలలో కోర్టు విచారణకు హాజరై తిరిగి వస్తుండగా ఆమె భర్త రమేష్ ద్విచక్ర వాహనంపై మణిమలాను చంపడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడని పోలీసులు అన్నారు..
అనంతరం మణిమాల వెనక్కి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. భరణం కోసం దావా వేయడంతో ఆగ్రహంతో రమేష్ ఇలా చేశాడని మణిమాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో రమేష్ కారు నడుపుతూ మణిమాలను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడని పోలీసులు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణిమాల ఇచ్చిన స్టేట్ మెంట్ తో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications