నేను ఎక్కడో ఉద్యోగం చేస్తుంటే ఇక్కడ నీ ప్రియుడికి స్వర్గం చూపిస్తావా ?
బెంగళూరు/మండ్య: వివాహం చేసుకున్న దంపతులు జీవితాంతం సంతోషంగా ఉండాలని వారి కుటంబ సభ్యులు ఎంతో ఆశపడ్డారు. దంపతులు హ్యాపీగా కాపురం చెయ్యడంతో ఓ బిడ్డకూడా పుట్టాడు. ఉద్యోగం చెయ్యడానికి భర్త సిటీకి వెళ్లాడు. సొంత ఊరిలోని ఇంట్లో బిడ్డను చూసుకుంటూ భార్య ఉంటోంది. తాను సిటీలో కష్టపడి పని చేస్తుంటే తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ప్రియుడితో జల్సా చేస్తోందని భర్త రగిలిపోయాడు.
కర్ణాటకలోని మండ్యలో నివాసముంటున్న ఓ కుటుంబంలో భర్త బతుకుదెరువు కోసం బెంగళూరుకు వచ్చి పని చేసేవాడు. ఇదిలా ఉండగా భార్య ఇంట్లో బిడ్డ పోషణ చేస్తూ కుటుంబాన్ని పోషించేది. అయితే ఇంట్లో భార్యతో గొడవకు దిగిన భర్త అతని భార్యపై దాడి చేసి హత్య చేసి అతని కసి తీర్చుకోవడం కలకలం రేపింది.

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను ఆమె భర్త హత్య చేశాడు. భర్త అతని భార్యతో ఐదేళ్లు జీవితాన్ని గడిపాడు. దంపతుల అన్యోన్యకాపురానికి సాక్షిగా ఉన్న కొడుకు నేడు రోడ్డునపడ్డాడు. భర్త బతుకుదెరువు కోసం బెంగళూరులో పనికి వెళ్లేవాడు. ఇప్పుడు ఇంట్లో బిడ్డను పెంచుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భార్య శీలాన్ని అనుమానిస్తూ నిత్యం గొడవలు పడుతున్న భర్త ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న మంజునాథ్ వారానికి రెండు మండ్య జిల్లాలోని నాగమంగలలోని ఇంటికి రెండు సార్లు కచ్చితంగా వచ్చి వెలుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం మంజునాథ్ అతని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో భార్య మధుశ్రీ లేకపోవడంతో మంజునాథ్ రగిలిపోయాడు.
మంగళవారం రాత్రి కూడా ఇదే విషయంలో ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పడ్డాడు. ఈ సమయంలో కోపంతో భార్యపై దాడి చేశాడు. నువ్వు ఎవరితో తిరిగుతున్నావని, నేను ఇంటికి వస్తున్నానని నీకు లెక్కలోకూడా లేదని మంజునాథ్ అతని భార్య మంజునాథ్ తో గొడవపెట్టుకున్నాడు. ఆ సందర్బంలో మధుశ్రీ, మంజునాథ్ దంపతుల మధ్య మాటామాటా పెరిగిపోయింది.

తరువాత సహనం కోల్పోయిన మంజునాథ్ అతని భార్యను దారుణంగా చంపేశాడు. భార్య మధుశ్రీ ప్రాణాలు పోయాయని తెలుసుకున్న మంజునాథ్ అక్కడి నుంచి పారిపోయాడు. భార్య మధుశ్రీకి అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న మంజునాథ్ అతని భార్యను చంపేశాడని, కేసు విచారణలో ఉందని మండ్య జిల్లాలోని నాగమంగల పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications