ఎంత దారుణం..! : 'దాడి.. ఆపై ఆమె రహస్య శరీర అంగాల మీద..'
జైపూర్ : మానవ సంబంధాలు వికృత రూపం దాలుస్తున్నాయి. లింగ వివక్ష బలంగా వేళ్లూనుకుపోయిన భారతీయ సమాజంలో మహిళలపై వేధింపులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా అదపు కట్నం కోసం కోడలిపై వేధింపులకు పాల్పడ్డ ఓ అత్తింటివారు.. చెప్పుకోలేని రీతిలో ఆమెను చిత్రవధకు గురిచేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఓ మహిళపై దారుణంగా దాడి చేసిన కొంతమంది ఆమె రహస్య శరీర భాగాలపై పచ్చబొట్లు పొడిచి పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు. దుండగులు మహిళను విపరీతంగా కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమె రహస్య శరీర భాగాలతో సహా ఏడు చోట్ల అసభ్యకరమైన రీతిలో పచ్చబొట్లు పొడిచారు.

నుదుటిపై 'మా నాన్న ఒక దొంగ' అంటూ పచ్చబొట్టు పొడిచారు. ఘటన అనంతరం మహిళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మహిళ తల్లిదండ్రులు చెబుతున్న దాని ప్రకారం కట్నం కోసం అత్తింటి వారే ఆ మహిళ పట్ల ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది.
పెళ్లి సమయంలో కట్నంగా ఇస్తామని చెప్పిన రూ.51 వేలు ఇవ్వకపోయినందు వల్లే ఈ చర్యకు పాల్పడినట్టు బాధిత యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. గతంలోను ఒకసారి తమ కూతురికి మత్తు మందు ఇచ్చి అత్తింటివారు నానా హింస పెట్టినట్టుగా యువతి తల్లిదండ్రులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications