వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ కేంద్రంలో కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం, కనీససౌకర్యాలు లేవు, సినిమా!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Karnataka assembly elections 2018: కనీస సౌకర్యాలు లేవంటూ మహిళ ఆవేదనతో ఆత్మహత్యాయత్నం

బెంగళూరు: గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రోడ్లు సమస్య, వీది దీపాలు సమస్యతో పాటు కనీససౌకర్యాలు లేక నిత్యం సతమతం అవుతున్నామని ఆరోపిస్తూ ఓ మహిళ పోలింగ్ కేంద్రంలో ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్ణాకలోని హావేరి జిల్లాలో సంచలనం కలిగించింది.

ఓటరు ఐడీతో మహిళ

ఓటరు ఐడీతో మహిళ

పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది, స్థానిక నాయకులు హడలిపోయి వెంటనే స్పంధించడంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. హావేరి జిల్లోని దేవగిరిలోని పోలింగ్ కేంద్రంలోకి శనివారం పాపమ్మ ఆర్కాచారి అనే మహిళ ఓటరు ఐడీ చేతిలో పట్టుకుని వెళ్లారు.

బ్యాగ్ లో కిరోసిన్ డబ్బా

బ్యాగ్ లో కిరోసిన్ డబ్బా

ఓటరు ఐడీ గుర్తింపు కార్డు చూపించి ఓటు వెయ్యడానికి ఈవీఎం దగ్గరకు వెళ్లారు. తరువాత బ్యాగ్ లో వెంట తీసుకెళ్లిన కిరోసిన్ డబ్బా బయటకు తీసిన పాపమ్మ ఒంటి మీద పోసుకున్నారు. తన గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని ఎన్నిసార్లు చెప్పినా నాయకులు పట్టించుకోలేదని పాపమ్మ ఆరోపించారు.

నా చావుతో సౌకర్యాలు రావాలి

నా చావుతో సౌకర్యాలు రావాలి

తన చావుతో అయినా మా గ్రామానికి కనీసౌకర్యాలు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పిన పాపమ్మ అగ్గిపెట్టె తీసుకుని నిప్పంటించుకోవడానికి ప్రమత్నించారు. ఆ సందర్బంలో హడలిపోయిన ఎన్నికల అధికారులు, సిబ్బంది, సమీపంలోని నాయకులు వెంటనే స్పంధించారు.

నెల రోజులు గడువు

నెల రోజులు గడువు

పాపమ్మ దగ్గరకు వెళ్లి ఒక నెలలో మీ గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్థానిక నాయకులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి మీరు ఇలాగే చెబుతున్నారని, ఒక్క హామీ నేరవేర్చలేదని పాపమ్మ తిరగబడ్డారు, చివకిరి పాపమ్మకు నచ్చ చెప్పిన పోలీసులు ఆమెను గ్రామస్తులకు అప్పగించి సమీపంలోని బాత్ రూంలో స్నానం చేయించి ఇంటికి పంపించారు.

English summary
karnataka assembly elections 2018: A lady attempted to commit suicide in polling booth accusing the elected members not providing basic facilities to the village. The incident took place in Devagiri, Haveri district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X