బెంగళూరులో పట్టపగలు అత్తా, కోడలు దారుణ హత్య
బెంగళూరు: ఇంటిలో చొరబడిన దుండగులు అత్తా, కోడలిని అతి దారుణంగా హత్య చేసి పరారైన ఘటన బెంగళూరు నగరంలోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వసంత్ నగర్ లో నివాసం ఉంటున్న సంతోషిబాయి (60), ఆమె కోడలు లతా (38) హత్యకు గురైనారు.
సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల మద్య జంటహత్యలు జరిగాయని పోలీసులు అంటున్నారు. అత్తా, కోడలు హత్యకు గురైన సమయంలో వారి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు.
లతా కుమార్తె స్కూల్ నుంచి ఇంటికి చేరుకోవడంతో జంటహత్యలు జరిగిన విషయం వెలుగు చూసింది. కంటోన్మెంట్ సమీపంలోని వసంత్ నగర్ లో గత 40 సంవత్సరాల నుంచి సంపత్ రాజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.

బళేపేటలో సంపత్ రాజ్ కెమికల్స్ వ్యాపారం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన షాప్ దగ్గరకు వెళ్లారు. తరువాత లతా భర్త బయటకు వెళ్లారు. అప్పటికే లత కుమార్తె స్కూల్ కు వెళ్లింది.
విషయం గుర్తించిన దుండగులు ఇంటిలో చొరబడి ఇద్దరిని అతిదారుణంగా హత్య చేసి పరారైనారు. సమాచారం తెలుసుకున్న బెంగళూరు పశ్చిమ విభాగం అడిషనల్ పోలీసు కమిషనర్ చరణ్ రెడ్డి, డీసీపీ సందీప్ పాటిల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
హత్యకు గురైన అత్తా, కోడలి శరీరం మీద ఉన్న బంగారు నగలు అలాగే ఉన్నాయని, ఇంటిలో విలువైన వస్తువులు చోరీ కాలేదని పోలీసు అధికారులు తెలిపారు. లతా ముఖం మీద గాయాలైనాయని పోలీసులు అన్నారు.
పోలీసు జాగిలాలు, వేలిముద్రల నిపుణులతో పరిశీలించి ఆదారాలు సేకరించామని పోలీసులు తెలిపారు. అత్తా, కోడలి హత్యలకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. పట్టపగలు జంటహత్యలు జరగడంతో బెంగళూరు నగరం ఉలిక్కిపడింది.












Click it and Unblock the Notifications