మొబైల్ కోసం వెళ్లి అక్కాచెల్లెళ్ల చేతిలో బలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో యువతులు ధైర్యం చేసి వారిని వారు రక్షించుకుంటున్నారు. ఢిల్లీలో యువతులకు ప్రత్యేకంగా స్వయం రక్షణ విద్యను నేర్పిస్తున్నారు. బుధవారం రాత్రి న్యాయశాస్త్రం విద్యార్థిని సోదరితో కలిసి ఒక దొంగను చితకబాది పోలీసులకు అప్పగించింది.
మొబైల్, వ్యానిటి బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించిన దొంగ కటకటాలపాలైనాడు. సురభి (21) అనే యువతి ఢిల్లీలో లా కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నది. ఈమె బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సోదరి సిమ్రాన్ తో కలిసి ఇంటికి బయలుదేరింది.

ఆ సందర్బంలో సురభి మొబైల్ లో మాట్లాడుకుంటూ వెళుతున్నది. మార్గం మధ్యలో సద్దాం అనే చిల్లర దొంగ వారి దగ్గరకు వెళ్లాడు. సురభి చేతిలో ఉన్న మొబైల్, వ్యానిటి బ్యాగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో సురభి సోదరి సిమ్రాన్ తో కలిసి అతనిని పట్టుకుని చితకబాదారు.
సద్దాం తప్పించుకుని అక్కడి నుంచి పరుగు తీశాడు. అయితే సురభి, సిమ్రాన్ వెంటాడని సద్దాంను పట్టుకుని పటేల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సురభి, సిమ్రాన్ ధైర్యాన్ని చూసి పోలీసు అధికారులు వారిని అభినందించారు.












Click it and Unblock the Notifications