వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు వేధింపులు: పగతో పోయెస్ గార్డెన్ పక్కనే ఇల్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఎలా వేధించాలి ? అంటూ శశికళ వర్గం పలుప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించాలని తమిళనాడు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఎలా వేధించాలి ? అంటూ శశికళ వర్గం పలుప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించాలని తమిళనాడు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.

పోలీసులకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అక్కడ కాదన్నుందుకే !పోలీసులకు షాక్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అక్కడ కాదన్నుందుకే !

A lawyer has given a petition to the Commissioner of Police

జయలలిత మరణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ పన్నీర్ సెల్వం బుధవారం ఒక్క రోజు ఉపవాస సత్యాగ్రహం చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజలు, కార్యకర్తల నుంచి పన్నీర్ సెల్వంకు ఊహించిన మద్దతు వచ్చింది.

పన్నీర్ సెల్వం దీక్షలో ఉన్న సమయంలో శశికళ వర్గంలోని న్యాయవాది చెన్నై నగర పోలీసు కమిషనర్ ను కలిసి వెంటనే ప్రభుత్వ బంగ్లాలో ఉన్న పన్నీర్ సెల్వంను ఖాళీ చేయించాలని వినతిపత్రం ఇచ్చారు. పన్నీర్ సెల్వం ప్రభుత్వ బంగ్లాను ఉపయోగించడానికి వీల్లేదని ఆ న్యాయవాది డిమాండ్ చేస్తున్నారు.

పన్నీర్ సెల్వం నిరాహార దీక్షలో దుమ్ములేపిన ధనుష్ పాటపన్నీర్ సెల్వం నిరాహార దీక్షలో దుమ్ములేపిన ధనుష్ పాట

చెన్నైలోని వీనస్ కాలనీలో నివాసం ఉండటానికి ఇప్పటికే పన్నీర్ సెల్వం ఓ ఇంటిని చూసుకున్నారు. పోయెస్ గార్డెన్ వెనుకనే వీనస్ కాలనీ ఉంది. పోయెస్ గార్డెన్ సమీపంలోనే పన్నీర్ సెల్వం ఇంటిని చూసుకోవడాన్ని మన్నార్ గుడి మాఫియా జీర్ణించుకోలేకపోయింది.

ఇప్పుడు తమ వర్గంలోని న్యాయవాదులతో చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేయించారని ఆరోపణలు వచ్చాయి. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం కొన్ని రోజుల పాటు ప్రభుత్వ బంగ్లాలో ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటని ఆయన వర్గీయులు వాదిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు వీరే ఇచ్చే మర్యాద ఇదేనా ? అంటు నిలదీస్తున్నారు.

English summary
A lawyer has given a petition to the Commissioner of Police to vacate former CM O Panneereselvam from his govt house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X