Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హీరోల లెక్కలు: అద్భుతమైన శ్రీదేవి ఫోటో రీట్వీట్, స్మృతి ఇరానీ భావోద్వేగం

ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి మృతిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రాత్రి అతిలోక సుందరి కన్ను మూశారు. ఆమె మృతిపై సిని, రాజకీయ సంతాపం తెలియజేస్తున్నారు.

స్మృతి ఇరానీ ఒకప్పుడు నటిగా వెలుగొందారు. ప్రస్తుతం బీజేపీలో కేంద్రమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీదేవికి చెందిన ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శ్రీదేవి అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పారు.

ఎవరితోను వివాదాలకు వెళ్లలేదు

ఎవరితోను వివాదాలకు వెళ్లలేదు

శ్రీదేవి ఎవరితోను వివాదాలకు వెళ్లే వారు కాదని, అణిగిమణిగి ఉండే మనస్తత్వం ఆమె సొంతం అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. 1991లలో చిత్ర పరిశ్రమను తన భుజాలపై వేసుకొన్న శ్రీదేవి, సూపర్ స్టార్‌గా వెలుగొందారన్నారు. ఆమె మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, నమ్మలేకపోతున్నానని చెప్పారు.

వేదికపై ఆమె ఒక్కరే నిల్చున్నారు

వేదికపై ఆమె ఒక్కరే నిల్చున్నారు

గత ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చనల చిత్రోత్సవ వేడుకలకు శ్రీదేవి వచ్చారని, ఆ సమయంలో వేదికపై ఆమె ఒక్కరే నిల్చున్నారని స్మృతి పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ వేదిక మొత్తం ఆమె మూర్తిమత్వ వెలుగుతో నిండిందన్నారు. శ్రీదేవి లెజండరీ నటి అన్నారు.

తనకు ప్రోటోకాల్ లేదు

తనకు ప్రోటోకాల్ లేదు

శ్రీదేవి తనను తాను ఆత్మవిమర్శ చేసుకుంటూ మానవతా దృక్పథంతో ముందుకు సాగారని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. క్రమశిక్షణ, వస్త్రధారణ, కట్టుబొట్టులో ఆమెకు ఆమె సాటి అన్నారు. తనకు ప్రోటోకాల్ అంటూ శ్రీదేవి ఎప్పుడూ అడగలేదని, ఓ సామాన్య వ్యక్తిగా ఉండేవారన్నారు.

శ్రీదేవిని చూసి హీరోలు అంచనా

శ్రీదేవిని చూసి హీరోలు అంచనా

హీరోలు కూడా తమ చిత్రాల బాక్సాఫీస్ రికార్డులను శ్రీదేవిని చూసి అంచనా వేసే వారు అంటే ఆమె ఏ మేర ప్రభావితం చూపేవారో అర్థం చేసుకోవచ్చునని స్మృతి ఇరానీ అన్నారు. ఆమెతో నాకు ఉన్న అనుభవం ఎప్పటికీ మరిచిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు.

శ్రీదేవి నుంచి నేర్చుకున్నా

శ్రీదేవి నుంచి నేర్చుకున్నా

శ్రీదేవి తనకు ఆదర్శమని, ఆమెను చూసి కలలు కన్నానని చెప్పారు. అభిమాన బాలిక నుంచి నటి, రాజకీయ నాయకురాలిగా ఎదిగానని చెప్పారు. తాను ఆమెను పలు సందర్భాల్లో కలిశానని, కానీ ఆమె గురించి కొత్తగా తెలుసుకొని వచ్చేదానిని అని చెప్పారు.

నా అభిమాన నటికి ఫేర్‌వెల్

నాలోని నటికి శ్రీదేవి స్ఫూర్తి అని స్మృతి ఇరానీ అన్నారు. మిస్టర్ ఇండియాలో శ్రీదేవిని చూసి తాను ఆనందంతో గంతులేశానని చెప్పారు. నా చిన్నతనంలో తనలో సంతోషాన్ని నింపిన నా అభిమాన నటికి తాను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+