వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Low Pressure In Bay Of Bengal: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: నైరుతికి తోడుగా..తుఫాన్‌గా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అరేబియా, బంగాళాఖాతంలో ఏర్పడిన తౌక్టే, యాస్ తుఫాన్లు సద్దుమణిగిన కొద్దిరోజుల్లోనే మరొకటి ఆవిర్భవించడానికి సిద్ధమైంది. బంగాళాఖాతంలో మరో తుఫాన్ ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొంది. ఈ నెల 11వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రమంగా ఇది తుఫాన్‌గా రూపాంతరం చెందొచ్చని పేర్కొంది. దీని ప్రభావం వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదని, క్రమంగా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలకు ఇది తోడవుతాయని తెలిపింది.

Coronavirus third wave: జగన్ సర్కార్ హైఅలర్ట్: అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ..!Coronavirus third wave: జగన్ సర్కార్ హైఅలర్ట్: అయిదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ..!

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సముద్రం ఉపరితలానికి 1.5 నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం ద్రోణీ ఆవరించి ఉందని, క్రమంగా ఇది అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 11వ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని పేర్కొంది. ఈ తరహా వాతావరణం వల్ల నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని, త్వరగా విస్తరిస్తాయని స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది.

 A low pressure area is likely to form over the north Bay of Bengal on June 11

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున.. ఈ నెల 10వ తేదీ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, సిక్కింలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే- ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని ఉన్న తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రవేశించిన రుతుపవనాలు క్రమంగా మరింత విస్తరించడానికి ఈ అల్పపీడనం దోహదపడుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జీకే దాస్ తెలిపారు. నైరుతి రుతుపవనాలకు ఇది తోడు కావడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు, మధ్య భారత్, ఈశాన్య రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.

English summary
A low pressure area is likely to form over the north Bay of Bengal on June 11 and catalyse the advance of southwest monsoon into West Bengal, Odisha, Jharkhand, Sikkim, Chhattisgarh, and Bihar, the Met department said here on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X