Thrissur రైల్వే స్టేషన్ పార్కింగ్ లో భారీ అగ్నిప్రమాదం- 200+ వాహనాలు భస్మీపటలం.. !!
కేరళలోని త్రిశూర్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పక్కన జరిగిన ఈ ఘటనలో 200లకు పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాలి బూడిద అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్, ఇంధన లీకేజీ లేదా ఇతర కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తసుకొచ్చారు. రోజువారీ 500కు పైగా బైక్‌లను నిలిపివుంచే సామర్థ్యం ఉందీ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో. ఇక్కడ పార్క్ చేసి ఉంచిన వాహనాలు పూర్తిగా ధ్వంసమై ఉండవచ్చని అంచనా. మంటల వల్ల పలు వాహనాల పెట్రోల్ ట్యాంకులు పగిలాయి. అందులోని పెట్రోల్ ఎగజిమ్మడం వల్ల మంటలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

రైల్వే పార్కింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే అగ్ని పెద్దఎత్తున వ్యాపించడానికి కారణమని భావిస్తోన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, తొలుత ఒకే బైక్ నుంచి తేలికపాటి మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో అగ్నిమాపక పరికరం అందుబాటులో ఉండి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్రంగా మారేది కాదని చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు నిమిషాల్లోనే ఇతర వాహనాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటన ప్రయాణికులు, సమీప నివాసితులలో భయాందోళనలు రేకెత్తించింది.
మంటలు ఆరిపోయినప్పటికీ, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేక వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వాహన యజమానులు సంఘటనస్థలానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది రోజువారీ ప్రయాణికులే. తమ వాహనాలు కాలి బూడిదవ్వడం చూసి ఆవేదన చెందారు.
ప్రమాదంలో ధ్వంసమైన వాహనాల ఖచ్చితమైన సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం ప్రస్తుతానికి అంతుబట్టలేదు. ఈ విచారణలో రైల్వే స్టేషన్ పరిసరాల సీసీటీవీ ఫుటేజీ కీలకం కానుంది. ఈ సంఘటన వల్ల రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు ధృవీకరించారు. పార్కింగ్ ప్రాంతం గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలో ఉంది. సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా మంటలు రైల్వే మౌలిక సదుపాయాలకు వ్యాపించకుండా నివారించగలిగారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications