మోదీ విమానంపై దాడికి ఉగ్రవాదుల ప్లాన్- ఉలిక్కిపడ్డ యంత్రాంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ నెల 10వ తేదీన ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు వివిధ సదస్సుల్లో పాల్గొన్నారు. అనంతరం అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి భేటీ కానున్నారు. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయం దీనికి వేదిక.
అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయనతో మోదీ భేటీ కాబోతోండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని. 10, 12 తేదీల్లో పారిస్‌లో ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు హాజరవుతారు. ప్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మక్రాన్‌తో భేటీ అవుతారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు.

డొనాల్డ్ ట్రంప్‌తో జరిగే భేటీలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, డిజిటల్, రక్షణరంగంలో పరస్పర సహకారం, ఉగ్రవాద అణచివేత, కౌంటర్ టెర్రరిజం, ఇండో- పసిఫిక్ సెక్యూరిటీ.. వంటి కీలకాంశాలపై ట్రంప్- మోదీ మధ్య చర్చలు సాగుతాయి. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపైనా సంతకాలు పెట్టే అవకాశాలు లేకపోలేదు.
ఆయన ప్రయాణిస్తోన్న విమానంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ప్లాన్ చేశారనే సమాచారం ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాని ఎయిర్‌క్రాఫ్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేస్తారనే పక్కా సమాచారం తన వద్ద ఉందంటూ ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. సెకెండ్ల వ్యవధిలో ఈ ఫోన్ కాల్ కట్ అయింది.
దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. మ్యాన్ హంట్ మొదలుపెట్టారు. ఈ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించారు. ఈ ఫోన్ కాల్ వ్యవధి కొన్ని సెకెండ్ల పాంటే అయినప్పటికీ- ఆ అజ్ఞాత వ్యక్తిని గుర్తించగలిగారు.
ముంబై చెంబూర్ ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తిని కొద్దిసేపటి కిందటే అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీస్ కమిషనర్ నిర్ధారించారు. మంగళవారం చెంబూర్ నుంచి ఆ వ్యక్తి ఫోన్ చేశాడని, ఈ ఉదయం అతన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తమ విచారణలో తేలిందని అన్నారు.












Click it and Unblock the Notifications