వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral News: నాన్నను చూడలేపోయాడు.. ఆయన సమాధినైనా చూడాలని..

|
Google Oneindia TeluguNews

గాలిలో ఎగిరే గాలిపటం మనమైతే.. మనల్ని ఎగిరేసేది అమ్మ.. ఆ మధ్యలో ఉన్న దారం నాన్న.. మనకు గాల్లో ఉన్న గాలిపటం కనిపిస్తుంది.. ఎగిరేసే అమ్మ కనిపిస్తుంది. కానీ మధ్యలో ఆధారంగా ఉన్న దారం మాత్రం కనిపించదు. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పాత్ర చాలా కీలకం.. అలాంటి నాన్న కళ్లతెరవక ముందే కన్నుమూస్తే.. అదే జరిగిందిక్కడ. తమిళనాడుకు చెందిన తిరుమారన్‌ పుట్టక ముందే నాన్నను కోల్పోయాడు.

1967

1967


నాన్నను చూడలేకపోయాను.. కనీసం నాన్న సమాధినైనా చూద్దామని ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. 50 ఏళ్లకు అతని ప్రయత్నం ఫలించింది. తిరుమారన్‌ తండ్రి కె రామసుందరం అలియాస్ పూంగుంట్రాన్ తన భార్య రాధాబాయితో కలిసి చాలా ఏళ్ల క్రితం మలేషియాకు వెళ్లారు. ఆయన ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే వారు. ఈ క్రమంలో 1967లో రామసుందరం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ సమయంలో గర్భంతో ఉన్న రాధాబాయి ఆ తర్వాత తిరుమారన్‌ జన్మించాడు.

35 సంవత్సరాల క్రితం

35 సంవత్సరాల క్రితం


ఆ తర్వాత అక్కడ ఉండలేకపోయిన రాధాబాయి కొడుకుతో కలిసి తమిళనాడు తిరిగి వచ్చింది. "1967లో మా నాన్న అనారోగ్యంతో మరణించినప్పుడు అతని వయసు 37. మా అమ్మ రాధాభాయ్ అంత్యక్రియల తర్వాత నన్ను ఇండియాకు తీసుకొచ్చింది. ఆమె 35 సంవత్సరాల క్రితం మరణించింది"అని తిరుమారన్ చెప్పారు. అతను తన తండ్రిని ఎక్కడ ఖననం చేశాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

కెర్లింగ్ తొట్టా థెసియా

"మా నాన్న మలేషియాలోని కెర్లింగ్‌లోని కెర్లింగ్ తొట్టా థెసియా వాకై తమిళ్ పల్లి అనే స్కూల్‌లో పనిచేశాడని నాకు తెలుసు. Google ద్వారా, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, పాఠశాల మరొక ప్రదేశానికి తరలించారని తెలుసుకున్నాను. నేను ప్రధానోపాధ్యాయుడు కుమార్ చిదంబరం ఇమెయిల్ చిరునామాను తెలుసుకుని.. నేను మా తండ్రి సమాధిని కనుగొనాలనుకుంటున్నాను మెయిల్ పెట్టాను "అని తిరుమారన్ గుర్తుచేసుకున్నాడు.

మోహనరావు, నాగప్పన్‌

చిదంబరం అప్పుడు రామసుందరం పాత విద్యార్థులు మోహనరావు, నాగప్పన్‌లను సంప్రదించారు. ఆ తర్వాత ఇద్దరూ కెర్లింగ్‌లో తమ గురువు సమాధిని గుర్తించి తిరుమారన్‌కు సమాచారం అందించారు. తిరుమారన్ నవంబర్ 8న మలేషియాకు వెళ్లారు. పొదల్లో నాన్న సమాధిని చూశారు. సమాధిపై రామసుందరం చిత్రం, అలాగే అతని పేరు, పుట్టిన, మరణ తేదీలు ఉన్నాయి. తన నాన్న సమాధి చూడడం ప్రశాంతతను ఇచ్చిందని తిరుమారన్ చెప్పారు.

అనాథ శరణాలయం

అనాథ శరణాలయం


స్వయంగా అనాథ కావడంతో తిరుమారన్ అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. "నేను దాదాపు 60 మంది అనాథలకు వివాహాలు నిర్వహించడంలో సహాయం చేశాను. 100 మందికి పైగా ఉద్యోగాలు వచ్చేలా చేశాను. 3,009 రక్తదాన శిబిరాలను నిర్వహించాను. నా తల్లిదండ్రులను కోల్పోయిన నాకు అనాథగా ఉండటం ఎంత కష్టమో నాకు తెలుసు"అని తిరుమారన్ వివరించాడు.

English summary
A man from Tamil Nadu found his father's grave with the help of Google. My father in Malaysia visited the grave. The news went viral locally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X