62 ఏళ్ల వయస్సులో తండ్రైన వ్యక్తి.. ఒకే కాన్పులో ముగ్గురు జననం..
దాదాపు ప్రతి మహిళకు తల్లి కావాలనే కోరిక ఉంటుంది. అలాగే ప్రతి పురుషుడికి తండ్రి కావాలనే ఆశ ఉంటుంది. అయితే కొంత మందికి పిల్లలు ఆలస్యంగా పుడతారు. అయితే వీరు పిల్లల కావాలనే అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆస్పత్రుల చుట్టు తిరుగతుంటారు. ఎప్పటికైనా తండ్రి కావాలనే ఆశతో ఉంటారు. ఇలా ఓ వ్యక్తి వృద్ధప్యంలో తండ్రయ్యాడు. అతను 62 ఏళ్ల వయస్సులు జాక్ పాట్ కొట్టాడు. ఒకేసారి ముగ్గురి పిల్లలకు తండ్రయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో జరిగింది.
పెళ్లైన 6 ఏళ్లకు తన రెండో భార్య ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన గోవింద్ కుష్వాహాకు భార్య కస్తూర్బా ఉంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అయితే 11 ఏళ్ల క్రితం వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి దోవింద్ కుష్వాహా సంతానం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే భార్య కస్తూర్బా గర్బం దాల్చే అవకాశం లేకపోవడంతో ఆమె రెండో పెళ్లికి భర్త గోవింద్ ను ఒప్పించింది.

ఆరేళ్ల క్రితం గోవింద్ హీరాబాయి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతర్‌బేదియా ఖుర్ద్ గ్రామంలో నివాసం ఉంటున్న గోవింద్ కుష్‌వాహా రెండో భార్య 42 ఏళ్ల హీరాబాయి కుష్‌వాహా ఈ బిడ్డలకు జన్మనిచ్చింది. హీరాబాయి, నవజాత శిశువులను జాగ్రత్తగా చూసుకుంటున్న అతని మొదటి భార్య కస్తూర్బా బాయి ఆనందం వ్యక్తం చేసింది. 62 ఏళ్ల వయస్సులో గోవింద్ కు ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టడంతో ఈ వార్త స్థానికంగా వైరల్ గా మారింది.
రెండు నెలల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఓ మహిళకు ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. ఈ మహిళకు మొదటగా బాబు, తర్వాత పాప, బాబు, బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది.












Click it and Unblock the Notifications