అనుమానంతో భార్య, అత్తపై కాల్పులు, కారులోనే భార్యను ఇలా...
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్యను హత్య చేశాడు ఓ భర్త,అంతేకాదు తన అత్తపై కూడ కాల్పులు జరిపి పారిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఘజియాబాద్:భార్యపై అనుమానంతో ఇంటి నుండి ఆమెను ఊరికి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్ళి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఆమె తల్లిదండ్రులపై కూడ కాల్పులకు దిగాడు ఆ కిరాతకుడు. రక్తమోడుతన్న భార్య శరీరాన్ని కారులోనే తరలిస్తుండగా పోలీసులు ఆ కిరాతకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియా బాద్ కు చెందిన సతేంద్ర టియోటియా తన భార్య రాజ్‌కుమారికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు.ఆమెను తుపాకితో కాల్చి చంపాడు.అయితే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు.

తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఆ వ్యక్తి భార్యను కారులో పొలం వద్దకు తీసుకెళ్ళి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను అదే కారులో ఇంటికి తీసుకువచ్చాడు. ఈ ఘటన బుదవారం సాయంత్రం చోటుచేసుకొంది.
అయితే కారులో రక్తమౌడుతున్న బాధితురాలని స్థానికులు చూసి ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు.అయితే నిందితుడు కారును అక్కడి నుండి వేగంగా తీసుకెళ్ళాడు. తన అత్తింటివారికి వెళ్ళాడు.అక్కడ ఉన్న తన అత్తపై రెండు రౌండ్లకాల్పులు జరిపి వెళ్ళిపోయాడు.












Click it and Unblock the Notifications