దారుణం: ఎక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నాడని పొడిచి చంపేశారు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు చికెన్ అమ్ముతున్నాడని వివాదానికి దిగడంతోపాటు ఆ కొట్టు యజమానిని దారుణంగా కొట్టి, కత్తులతో పొడిచి చంపారు. ఢిల్లీలోని జహంగీర్పూరిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌లోని మదీనాపూర్ జిల్లా కేశర్పూర్ జల్పాయ్ గ్రామానికి చెందిన షిరాజ్(35) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఢిల్లీ వచ్చి చేపలు, చికెన్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా షాపు మూతపడటంతో తన ఇంటి వద్దే చిన్న షెడ్డులో చేపలు, చికెన్ మంసం విక్రయిస్తున్నాడు.

కాగా, బుధవారం సాయంత్రం షా ఆలమ్ అనే వ్యక్తి చికెన్ కొనుగోలు కోసం షిరాజ్ షాప్‌కు వచ్చాడు. చికెన్ ధర వేరే చోట కంటే ఎక్కువగా ఎందుకు అమ్ముతున్నావంటూ అతడు షిరాజ్‌తో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో షిరాజ్ కిందపడిపోయాడు.
ఈ గొడవ గురించిన తెలిసిన షా ఆలమ్ సోదరులు అక్కడికి చేరుకుని షిరాజ్‌ను కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సషిరాజ్‌ను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు.
షా ఆలమ్ తోపాటు అతడి ముగ్గురు సోదరులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. షా ఆలమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications