Hindu Gods: హిందూ దేవుళ్లను పూజిస్తే మీకు రోగాలు తగ్గవు. నేను చెప్పినట్లు చెయ్యండి !
బెంగళూరు/కొడుగు: మతమార్పిడి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బలవంతపు మతమార్పిడి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. మతమార్పిడి చెయ్యడానికి ప్రయత్నించారని, హిందూ దేవుళ్లను కించపరుచుతూ పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ణాటకలోనిలోని కొడగులో హిందూ మతాన్ని అవమానించాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్లను అవమానంగా కించపరిచి మాట్లాడాడనే ఆరోపణలపై కుమార్ నిశాంత్ అలియాస్ నిశాంత్ కుమార్ అనే వ్యక్తిని కొడుగు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారురు.

కొడుగు జిల్లాలోని మడికేరిలోని జనరల్ తిమ్మయ్య సర్కిల్‌లో నిశాంత్ కుమార్ పుస్తకాలు విక్రయిస్తున్నాడు. క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలు విక్రయిస్తున్న నిశాంత్ కుమార్ పుస్తకాలు కొనుగోలు చెయ్యడానికి వస్తున్న ప్రజల ముందు హిందూ దేవుళ్లను కించరిచి మాట్లాడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి.
ఇదే సమయంలో హిందూ దేవతలు మీరు పూజిస్తే మీ రోగాలు నయం కావని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలు చదవాలని చెబుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. బలవంతంగా ప్రజలకు క్రైస్తవ మతానికి చెందిన పుస్తకాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మడికేరిలోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న నిశాంత్ కుమార్ నిశాంత్ మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications