ఆసుపత్రిలోనే వివాహం, ఎందుకంటే?
ప్రేమించిన యువతిని నిర్ణీత ముహుర్తానికే పెళ్ళి చేసుకోవాలని ప్రియుడు భావించాడు. అయితే వివాహ సమయానికి ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే ప్రియుడు ఆసుపత్రిలోనే ప్రియురాలికి తాళి కట్టి మరీ పె
కోల్‌కతా: ప్రేమించిన యువతిని నిర్ణీత ముహుర్తానికే పెళ్ళి చేసుకోవాలని ప్రియుడు భావించాడు. అయితే వివాహ సమయానికి ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అయితే ప్రియుడు ఆసుపత్రిలోనే ప్రియురాలికి తాళి కట్టి మరీ పెళ్ళి చేసుకొన్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకొంది.
కోల్‌కతాకి చెందిన ఆలం అనే వ్యక్తి సౌదీ అరేబియాలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి కోల్‌కతాకి చెందిన హేరా అనే ప్రేయసి ఉంది. ఇంట్లో వారిని ఒప్పించి ఇద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు.

వివాహ సమయం దగ్గరపడుతున్న సమయంలో హేరా తీవ్ర కడుపునొప్పితో అనారోగ్యానికి గురైంది. దాంతో కుటుంబసభ్యులు ఆమెని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే తన పెళ్లి వాయిదా పడకూడదని భావించిన ఆలం సౌదీ నుంచి కోల్‌కతాకి వచ్చేశాడు. అంతేకాదు హేరా చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి ఆమెని పెళ్లాడాడు.
ఇందుకు ఇరువురి కుటుంబీకులు సమ్మతించడం గమనార్హం. అంత కడుపునొప్పితో బాధపడుతున్న హేరాను ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే ఎర్రటి లెహెంగా వేసి పెళ్లికుమార్తెగా ముస్తాబు చేశారు. ఈ బట్టల్లోనే ఆమెను ఆలం వివాహం చేసుకొన్నాడు.












Click it and Unblock the Notifications